Dhanush Aishwarya Divorce:  విడిపోయిన ప్రముఖ సినీ జంట ఐశ్వర్య-ధనుష్

Published : Jan 17, 2022, 11:47 PM ISTUpdated : Jan 18, 2022, 12:11 AM IST
Dhanush Aishwarya Divorce:  విడిపోయిన ప్రముఖ సినీ జంట ఐశ్వర్య-ధనుష్

సారాంశం

బిగ్ బ్రేకింగ్: మ‌రో ప్ర‌ముఖ సినీ జంట విడిపోయింది. ప్రముఖ సినీ నటుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తనయ ఐశ్వర్య (Aishwarya).. త‌న భ‌ర్త, హీరో ధనుష్ (Dhanush)తో విడిపోతున్న‌ట్టు (separation) ప్ర‌క‌టించారు. న‌టుడు ధ‌నుష్ సైతం తాము విడిపోతున్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాడు. దాదాపు 18  సంవత్సరాలు కలసి వున్న ఐశ్వర్య-ధనుష్ విడిపోవ‌డం అంద‌రినీ షాక్ కు గురిచేస్తున్న‌ది.    

తాము విడిపోతున్న విష‌యాన్ని ఇరువురు ప్ర‌క‌టించారు. 18 సంవత్సరాలు కలసి వున్న ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇది అభిమానులకు, సినీ ప్రియులకు షాకింగ్ న్యూస్! 18 ఏళ్ల అనుబంధం తర్వాత తాను, తన భార్య ఐశ్వర్య విడిపోయామని నటుడు ధనుష్ సోమవారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రకటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతుర్తే అయిన ఐశ్వ‌ర్య‌.  ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య‌లు 2004లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హీరో ధ‌నుష్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ.. “18 సంవత్సరాల పాటు స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరికొకరు కలిసిమెలిసి, ఎదుగుదల, అవగాహన, సర్దుబాటు, అనుకూలతతో సాగిన ప్రయాణం... ఈరోజు మనం (ఐశ్వ‌ర్య‌) విడిపోయే చోట నిలబడ్డాం... ఐశ్వర్య- నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. దీన్ని ఎదుర్కోవడానికి అవసరమైన గోప్యతను మాకు అందించండి. ఓం నమశివాయ! ప్రేమను పంచండి” అంటూ ధ‌నుష్ ట్విట్ చేశారు. 

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా ఇదే పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఆమె క్యాప్షన్‌లో ఇలా రాసింది, "క్యాప్షన్ అవసరం లేదు...మీ అవగాహన..మీ ప్రేమ అవసరం మాత్రమే!" అంటూ పేర్కొంది. కాగా, ధనుష్ మరియు ఐశ్వర్య నవంబర్ 18, 2004న దక్షిణ భారత సంప్రదాయ ప్ర‌కారం ఘ‌నంగా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు యాత్ర రాజా, లింగ ధనుష్ ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా