కరోనా బారిన పడ్డ `బిగ్‌బాస్‌5` బ్యూటీ సిరి..

Published : Jan 17, 2022, 10:43 PM IST
కరోనా బారిన పడ్డ `బిగ్‌బాస్‌5` బ్యూటీ సిరి..

సారాంశం

స్వల్ప  లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి పేర్కొంది. దీంతో అభిమానులు  స్పందిస్తూ ఆమెకి ధైర్యాన్నిస్తున్నారు. జాగ్రత్తగా  ఉండాలని కోరుతున్నారు.

`బిగ్‌బాస్‌ 5` ఫేమ్‌ సిరి(Biggboss5 Siri)) హన్మంత్‌ కరోనా బారిన పడ్డారు. తాజాగా తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించింది. ఈ మేరకు ఆమె తన  ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా  వెల్లడించింది. స్వల్ప  లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి పేర్కొంది. దీంతో అభిమానులు  స్పందిస్తూ ఆమెకి ధైర్యాన్నిస్తున్నారు. జాగ్రత్తగా  ఉండాలని కోరుతున్నారు. ఆమెకి  బరోసాగా  నిలుస్తున్నారు. Siri బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌తో పాపులర్‌ అయ్యింది సిరి. యూట్యూబర్‌గా పాపులర్‌ అయిన ఈ భామ `బిగ్‌బాస్‌`లోకి వచ్చాక యమ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 

ముఖ్యంగా షణ్ముఖ్‌తో కలిసి ఆమె చేసిన  సందడి అంతా ఇంతా కాదు, బోల్డ్  అండ్‌ బ్యూటీఫుల్‌ అనేలా బుల్లితెర రియాలిటీ షోలో కనువిందు చేసింది. షోలో టాప్‌ 5గానూ నిలిచింది సిరి. సన్నీకి దీటుగా పోరాడి తన సత్తాని చాటుకుంది. హౌజ్‌లో షణ్ముఖ్‌తో ఎమోషనల్‌గానూ బాగా కనెక్ట్ అయి ఆకట్టుకుంది. అయితే హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక మాత్రం షణ్ముఖ్‌ ప్రియురాలు దీప్తి  సునైనా,  షణ్ముఖ్‌ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. షణ్ముఖ్‌,  దీప్తి  తమ  లవ్‌కి బ్రేకప్‌ చెప్పుకున్న విషయం తెలిసిందే. హౌజ్‌లో షణ్ముఖ్‌తో సిరి క్లోజ్‌గా  మూవ్‌ కావడం వల్లే దీప్తి విడిపోయిందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు. దీనిపై స్పందించిన సిరి ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. వారి బ్రేకప్‌కి తాను కారణం కాదని తెలిపింది. 

మరోవైపు కరోనా దేశంలో విజృంభిస్తోంది. రోజుకి మూడు లక్షల వరకు కేసులు నమోదవుతున్నాయి.  సెలబ్రిటీలు సైతం భారీగా  కరోనా బారిన పడుతున్నారు. సినీ సెలబ్రిటీల్లో టాలీవుడ్‌లో ఇప్పటికే మహేష్‌బాబు, కీర్తిసురేష్‌, థమన్‌, మంచు మనోజ్‌, బండ్ల గణేష్‌, రాజేంద్రప్రసాద్‌ వంటి ప్రముఖులు కరోనా  బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా