మహేష్ - సుకుమార్.. సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారా?

Published : Dec 02, 2018, 05:47 PM IST
మహేష్ - సుకుమార్.. సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారా?

సారాంశం

స్టార్ దర్శకులు ఒక బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగానే నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తారా అని [ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూ ఉండటం సహజం. ఈ ఏడాది రంగస్థలం సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సుకుమార్ పై కూడా అదే ఆలోచనతో ఉన్నారు.

స్టార్ దర్శకులు ఒక బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగానే నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తారా అని [ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూ ఉండటం సహజం. ఈ ఏడాది రంగస్థలం సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సుకుమార్ పై కూడా అదే ఆలోచనతో ఉన్నారు. మహేష్ -మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే సుక్కు కోసం సిద్ధంగా ఉన్నారు. 

కథ సిద్ధమైతే ఈ కాంబినేషన్ లో సినిమా త్వరగానే పట్టాలెక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో మహేష్ కు ఒక పీరియడ్ డ్రామా లైన్ వివరించగా రిస్క్ చేయలేను అని మొహం మీదే చెప్పేశాడు. దీంతో సుకుమార్ ప్రస్తుతం బ్యాంకాక్ ట్రిప్ లో ఒక డిఫరెంట్ కథను అల్లుతున్నట్లు సమాచారం. మహేష్ కు సింగిల్ లైన్ లో చెబితే ఒప్పుకోడని వీలైనంత వరకు ఫుల్ స్క్రిప్ట్ తో వెళ్లి కళ్ళముందు సినిమాను ప్రజెంట్ చేయాలనీ కథను రాస్తున్నారట. 

త్వరలోనే మహేష్ కు సుక్కు కథను వివరించనున్నాడట. ఒకవేళ మహేష్ ఒప్పుకుంటే సంక్రాంతి సమయంలో అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చి టైటిల్ ను ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలనీ మైత్రి సుక్కుతో చర్చలు జరిపింది. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా 2019 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.   

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌