మహేష్ - సుకుమార్ కోసం ఎవరో ఒకరు?

Published : Nov 02, 2018, 05:03 PM IST
మహేష్ - సుకుమార్ కోసం ఎవరో ఒకరు?

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అయిపోగానే ప్రిన్స్ మహేష్ సుకుమార్ ప్రాజెక్ట్ ను పెట్టాలెక్కించనున్నాడు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అయిపోగానే ప్రిన్స్ మహేష్ సుకుమార్ ప్రాజెక్ట్ ను పెట్టాలెక్కించనున్నాడు. ఆల్ రెడీ మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ మూవీ తమ ప్రొడక్షన్ లోనే తెరకెక్కాలని మాట కూడా తీసుకుంది. 

అసలు విషయంలోకి వస్తే ముందుగానే హీరోయిన్స్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకోవాలని దర్శకుడు సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ అనే నేను హీరోయిన్ కైరా అద్వానీని అలాగే గీత గోవిందం సినిమాతో అందరిని ఆకర్షించిన రష్మిక మందానను కలిసినట్లు సమాచారం. ఇద్దరిలో ఎవరో ఒకరు మహేష్ సరసన నటించే అవకాశం ఉంది. 

ఇంకా స్టోరీ మొత్తం పూర్తవ్వలేదు గాని ముందుగా ప్రధాన పాత్రలధారులను సెలెక్ట్ చేసుకోవాలని సుక్కు నిర్ణయం తీసుకున్నాడు. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి 2019 సమ్మర్ లో సినిమాను పట్టాలెక్కించాలని ఆలోచిస్తున్నారు. ఆ లోపు మహేష్ మహర్షి సినిమా పూర్తవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు