కళావతి వెంటపడబోతున్న మహేష్‌.. లవర్స్ డే గిఫ్ట్ `సర్కారు వారి పాట` ఫస్ట్ సింగిల్‌

Published : Feb 07, 2022, 05:25 PM IST
కళావతి వెంటపడబోతున్న మహేష్‌.. లవర్స్ డే గిఫ్ట్ `సర్కారు వారి పాట` ఫస్ట్ సింగిల్‌

సారాంశం

ప్రేమికుల రోజు సందర్భంగా మహేష్‌బాబు తన అభిమానులకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. తాను నటిస్తున్న `సర్కారు వారిపాట` చిత్రంలోని మొదటి పాటని విడుదల చేయబోతున్నారు. 

మహేష్‌బాబు (Maheshbabu) నటిస్తున్న `సర్కారు వారి పాట` (Saraku Vaari Paata) చిత్రం నుంచి ఎట్టకేలకు సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈచిత్రం నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ మాత్రమే విడుదలయ్యాయి. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్లు లేవు. దీంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని, ఓ పాటని విడుదల చేయాలని భావించారు. కానీ హీరో మహేష్‌కి కరోనా సోకడం, అలాగే సంగీత దర్శకుడు థమన్‌ సైతం వైరస్‌ బారిన పడటంతో అప్‌డేట్‌ ఇవ్వలేకపోయారు. 

ఇప్పుడు ఆ వెయిటింగ్‌కి తెర దించారు. ఎట్టకేలకు ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేయబోతున్నారు. `కళావతి` పేరుతో వచ్చే పాటని విడుదల చేయనున్నట్టు యూనిట్‌ సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఈ రోజు మార్నింగ్‌ ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 14న అప్‌డేట్లు ఇస్తామని వెల్లడించింది. చెప్పినట్టుగానే ఈ సాయంత్రం `సర్కారు వారి పాట` చిత్రంలోని తొలి పాట టైటిల్‌ని ప్రకటించింది. 

ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తిసురేష్‌(Keerthy Suresh) పేరు కళావతి అని తెలుస్తుంది. మహేష్‌, కీర్తిసురేష్‌ల మధ్య వచ్చే లవ్‌ సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. అందరి హృదయాలను కొల్లగొట్టేలా ఉంటుందని తెలిపింది యూనిట్‌. మంచి మెలోడీ సాంగ్‌ అని తెలుస్తుంది. ఇక ఈచిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తుండగా, పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా మే 12న విడుదల చేయబోతున్నారు. 

బ్యాంక్‌ కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. దేశంలో, ప్రపంచంలో జరిగే బ్యాంక్‌ కుంభకోణాలను ఇందులో చూపించబోతున్నారు. ఓ బ్యాంక్‌ ఎంప్లాయ్‌ వాటిని ఎలా ఎదుర్కొన్నారు, అవినీతిని ఎలా బయటకు తీశాడనే కథాంశంతో సాగుతుందట. ఇందులో మహేష్‌ బ్యాంక్‌ ఎంప్లాయ్‌గా కనిపిస్తారని టాక్‌. `సరిలేరు నీకెవ్వరు` చిత్రం తర్వాత మహేష్‌ నటిస్తున్న సినిమా ఇది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ చిత్రం తెరపైకి రాబోతుంది. నిజానికి ఈ సినిమా గతేడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత సంక్రాంతి 13న విడుదల చేయాలని నిర్ణయించారు. 

కానీ `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` వంటి పెద్ద సినిమాలుండటంతో వాటితో పోటీ సరికాదని, నిర్మాతల మధ్య జరిగిన చర్చల కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఏప్రిల్‌ 1న  ఉగాది కానుకగా విడుదల చేయాలని ప్రకటించారు. కానీ థర్డ్ వేవ్‌ కరోనా కారణంగా, మహేష్‌కి, కీర్తిసురేష్‌కి కరోనా సోకడం కారణంగా మళ్లీ ఈ చిత్రం వాయిదా పడింది. ఇప్పుడు మే 12న వేసవి కానుకగా విడుదల చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం