ముందు ప్లాన్ ప్రకారం సినిమాని అమెరికాలో ప్రారంభించాలనుకున్నారు. మొదటి షెడ్యూల్‌ని అమెరికాలోనే ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ బెడిసికొట్టిందని తెలుస్తుంది. కరోనా, వాతావరణంతోపాటు పలు ఇతర కారణాల వల్ల దాన్ని విరమించుకున్నారట.
మహేష్‌బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటించబోతున్నారు. ఇటీవలే ఇది పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సితార, నమ్రత చేతుల మీదుగా సినిమాని ప్రారంభించారు. ఎప్పటిలాగే మహేష్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ని జనవరి నుంచి షురూ చేయబోతున్నట్టు తెలిపారు.
అయితే ముందు ప్లాన్ ప్రకారం సినిమాని అమెరికాలో ప్రారంభించాలనుకున్నారు. మొదటి షెడ్యూల్‌ని అమెరికాలోనే ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ బెడిసికొట్టిందని తెలుస్తుంది. కరోనా, వాతావరణంతోపాటు పలు ఇతర కారణాల వల్ల దాన్ని విరమించుకున్నారట. మొదటి షెడ్యూల్‌ని ఇప్పుడు హైదరాబాద్‌లోనే చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నెల రోజులపాటు ఇక్కడే చిత్రీకరించి, ఫిబ్రవరిలోనే అమెరికా వెళ్లాలనుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఇక ఫస్ట్ టైమ్ మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంగా, మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బ్యాక్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, ఇందులో మహేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవలే మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి అమెరికా వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.