స్టార్ వార్ ఇక్కడే కానీ అక్కడ కాదు

Published : Dec 30, 2016, 02:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
స్టార్ వార్ ఇక్కడే కానీ అక్కడ కాదు

సారాంశం

స్విట్జర్లాండ్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్, మహేష్ బాబు ఇద్దరూ కలిసి సరదాగా దిగిన ఫోటోను సోషల్ సైట్స్ లో పోస్ట్ చేసిన స్టార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న మహేష్, చరణ్ ల ఫోటో

ముఖ్యంగా పెద్దింటి కుటుంబాలకు చెందిన హీరోలు అంత ఫ్రెండ్లీగా ఉండరని ఊహించుకుంటారు. అయితే ఆ ఊహ నిజం కాదని కొన్ని సంఘటనలు చెబుతుంటాయ్‌. తాజాగా, ఓ ఫొటో ఆ విషయాన్ని మరింత బలంగా చూపించింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ చిరునవ్వులు చిందిస్తూ, దిగిన ఈ ఫొటో ఇక్కడిది కాదు. భార్యాపిల్లలతో కలసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి మహేశ్‌ విదేశాలు వెళ్లారు.



ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ నగరంలో ఉన్నారు. రామ్‌చరణ్‌ కూడా అక్కడే ఉన్నారు. ఈ ఇండియన్‌ స్టార్స్‌ అక్కడ సందడి చేశారు. ఫొటో దిగి, ‘బియాండ్‌ బౌండరీస్‌... హ్యాపీ హాలీడేస్‌’ అని మహేశ్, చరణ్‌ సోషల్‌ మీడియాలో పెట్టారు. ఎక్కడైనా స్టార్‌ కాని ఫ్రెండ్‌షిప్‌ విషయంలో స్టార్‌ కాదన్నట్లుగా మహేశ్‌ – చరణ్‌ చెబుతున్నట్లుంది కదూ. అనుకోకుండా కలిసినా స్టార్‌ స్టేటస్‌ని పక్కన పెట్టి, ఇలా కాసేపు ఫ్రెండ్లీగా హాలిడేస్‌ని ఎంజాయ్‌ చేయడం స్నేహపూరిత వాతావరణాన్ని తెలియజేస్తోంది.

PREV
click me!

Recommended Stories

VAS 8 Days Collections: ఫ్రైడే పుంజుకున్న విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కలెక్షన్లు.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
KAAKA Title Glimpse: 'కాకా'గా చిరంజీవి కూల్ బ్లాస్ట్.. బుద్ధిమంతుడిలా కనిపించే సత్యం వెనుక పెద్ద మిస్టరీ