కథ నచ్చినా మహేష్ ఒప్పుకోవట్లే..?

Published : May 08, 2019, 02:53 PM IST
కథ నచ్చినా మహేష్ ఒప్పుకోవట్లే..?

సారాంశం

 ఓటమి నేర్పే పాఠాలను ఏ మాత్రం మర్చిపోకూడదు అని సినీ వరల్డ్ లో చాలా మంది చెబుతుంటారు. అయితే అది పాటించేవారు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు. ప్రస్తుతం మహేష్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. 

సక్సెస్ లు ఎంత ఆనందాన్ని ఇచ్చినా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన మాత్రం ఫెయిల్యూర్స్ వల్లే వస్తాయి. ఓటమి నేర్పే పాఠాలను ఏ మాత్రం మర్చిపోకూడదు అని సినీ వరల్డ్ లో చాలా మంది చెబుతుంటారు. అయితే అది పాటించేవారు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు. ప్రస్తుతం మహేష్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. 

బ్రహ్మోత్సవం డిజాస్టర్ అనంతరం స్క్రిప్ట్ ల విషయంలో ప్రిన్స్ తన ఆలోచనలను పూర్తిగా మార్చుకున్నాడు. అప్పటివరకు సక్సెస్ లో ఉన్న దర్శకులు వచ్చి కథ చెబితే.. కేవలం కాన్సెప్ట్ ను చూసి ఒకే చెప్పే మహేష్ వరుస డిజాస్టర్స్ అనంతరం కథను పూర్తిగా విన్నాకె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. మొన్న గీత గోవిందం దర్శకుడు పరశురామ్ కూడా అదే తరహాలో స్క్రిప్ట్ ను వినిపించాడు. 

అది మహేష్ కి నచ్చినప్పటికీ వెంటనే ఒప్పుకోలేదు. బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తే గాని సినిమా చేయడానికి ఒప్పుకోలేను అని క్లియర్ గా చెప్పేశాడట. అలాగే ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని దర్శకుడికి మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహర్షి రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అనంతరం పరశురామ్ కథ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్. 

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ