మహేష్ నెక్స్ట్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Published : May 17, 2019, 05:58 PM IST
మహేష్ నెక్స్ట్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

సారాంశం

మహర్షి సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడు?.. అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే నెక్స్ట్ అనిల్ రావిపూడితో మహేష్ వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

మహర్షి సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడు?.. అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే నెక్స్ట్ అనిల్ రావిపూడితో మహేష్ వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. రాజా ది గ్రేట్ - F2 వంటి సినిమాలతో ఆడియెన్స్ బాగా దగ్గరైన మహేష్ ఫస్ట్ టైమ్ 100కోట్ల మార్కెట్ ఉన్న హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు. 

కోట్లాది అభిమానులున్న మహేష్ కి ఎలాంటి కథను సెట్ చేశాడో అనే ఆసక్తి అందరిలో ఉంది.  ఆ విషయాలన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ కాంబో పై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మెయిన్ గా టైటిల్ విషయం హాట్ టాపిక్ గా మారింది. 

సరిలేరెవ్వరు నీకు.. అనే టైటిల్ ని ఆలోచిస్తున్నట్లు ఇటీవల ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కథకు తగ్గట్టుగా 'రెడ్డిగారి అబ్బాయి' అనే మరో టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని టాక్. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. 

PREV
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?