వరుణ్ తేజ్ కి తమన్నా ఛాలెంజ్.. అగ్గి రాజేసిన మిల్కీ బ్యూటీ, వీడియో వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 28, 2022, 04:14 PM IST
వరుణ్ తేజ్ కి తమన్నా ఛాలెంజ్.. అగ్గి రాజేసిన మిల్కీ బ్యూటీ, వీడియో వైరల్

సారాంశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి ఈ ఏడాది రెండు క్రేజీ చిత్రాలు రాబోతున్నాయి. అందులో ఒకటి ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 కాగా మరొకటి వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'గని'. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి ఈ ఏడాది రెండు క్రేజీ చిత్రాలు రాబోతున్నాయి. అందులో ఒకటి ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 కాగా మరొకటి వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'గని'. ఈ రెండూ ఒకదానికొకటి పొంతనలేని చిత్రాలు. ఎఫ్3 కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్. ఇక 'గని' యాక్షన్ మూవీ. 

డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడుతున్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మార్చిలో ఈ చిత్ర రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. కరోనా పరిస్థితులు సహకరిస్తాయో లేదో చూడాలి. 

ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవల విడుదలైన ఆ సాంగ్ వైరల్ గా మారింది. 'కొడ్తే' అంటూ సాగే ఆ పాటలో తమన్నా తన ఎనెర్జిటిక్ డాన్స్ మూవ్స్ అదరగొడుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్నా.. గని చిత్రంలో జంటగా నటించిన వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ కి ఛాలెంజ్ విసిరింది. 

కొడ్తే సాంగ్ కి తమన్నా డాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. తనలాగా డాన్స్ చేయాలనీ వారిద్దరిని కోరింది. వారిద్దరికీ 'కొడ్తే డాన్స్ ఛాలెంజ్' విసిరింది. తమన్నా డాన్స్ సోషల్ మీడియాలో మంటలు రేపే విధంగా ఉన్నాయి. మరి మిల్కీ బ్యూటీ ఛాలెంజ్ విసిరితే వరుణ్ తేజ్ స్వీకరించకుండా ఉంటాడా.. వరుణ్ ఆ సాంగ్ కి ఎలా డాన్స్ చేస్తాడో వేచి చూడాలి. 

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines: సమంతకి పెద్ద షాక్‌, రష్మికకి గట్టి దెబ్బ.. ఇండియా నెంబర్‌ 1 హీరోయిన్‌ మారిపోయింది
Folk Song: తన జానపద పాటలతో యూట్యూబ్‍ను షేక్ చేసిన అల్లుఅర్జున్ సింగర్