చిరు బర్త్ డే హంగామా... మహేష్ చేతుల మీదుగా భోళా శంకర్ మోషన్ పోస్టర్ రిలీజ్

By team teluguFirst Published Aug 22, 2021, 9:43 AM IST
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ చిరు 155వ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి భోళా శంకర్ అనే మాస్ టైటిల్ నిర్ణయించారు. టైటిల్ డిజైన్,పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. 
 

మెగా ఫ్యాన్స్ లో పండగ వాతావరణం నెలకొంది. నేడు మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే నేపథ్యంలో ప్రప్రంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి అభిమానులు, చిత్ర ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. మరోవైపు చిరు నుండి రానున్న భవిష్యత్ చిత్రాల వరుస అప్డేట్స్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ పంచుతున్నాయి. నిన్నటి నుండే మెగాస్టార్ తన ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్స్ ఇస్తూ వస్తున్నారు. 


ఇక దర్శకుడు మెహర్ రమేష్ తో చిరు మూవీపై అధికారిక ప్రకటన విడుదల కాగా నేడు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ చిరు 155వ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి భోళా శంకర్ అనే మాస్ టైటిల్ నిర్ణయించారు. టైటిల్ డిజైన్,పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. 


ఇక భోళా శంకర్ టైటిల్ పోస్టర్ విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు మహేష్ తెలియజేశారు. చిరంజీవికి బర్త్ డే విషెష్ తెలియజేసిన మహేష్, దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్ సుంకరకు బెస్ట్ విషెష్ తెలియజేశారు. భోళా శంకర్ మూవీ 2022లో విడుదల చేయనున్నట్లు మోషన్ పోస్టర్ లో క్లారిటీ ఇచ్చారు టీం. ఏ కె ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


కొరటాల శివతో మెగాస్టార్ చేస్తున్న ఆచార్య విడుదలకు సిద్ధం అవుతుండగా,లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ జరుపుకుంటుంది. యువ దర్శకుడు బాబీతో మరో మూవీపై అధికారిక ప్రకటన చేశారు చిరంజీవి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ పై నేడు సాయంత్రం మరో కీలక అప్డేట్ రానుంది. 
 

Happy birthday garu🤗 Honoured to be unveiling the title of your film! , under the directorial skills of my good friend and my favourite producer garu

May the year ahead bring you great health and success. All the best sir! pic.twitter.com/U9czmnIK5I

— Mahesh Babu (@urstrulyMahesh)
click me!