మహేష్ భట్, రియా వాట్స్ అప్ చాట్ లీక్, బయటికి వచ్చిన సంచలన నిజాలు..!

Published : Aug 21, 2020, 09:46 AM IST
మహేష్ భట్, రియా వాట్స్ అప్ చాట్ లీక్, బయటికి వచ్చిన సంచలన నిజాలు..!

సారాంశం

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతుండగా రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తుంది.దర్శకుడు మహేష్ భట్, మరియు రియా చక్రవర్తి మధ్య జరిగిన వాట్స్ అప్ చాట్ బయటికి రాగా, సంచలనంగా మారింది.

ఓ ప్రముఖ ఛానల్ సుశాంత్ ఆత్మ హత్య కేసులో సంచలన విషయాలు పెట్టింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ముద్దాయిగా ఉన్న రియా చక్రవర్తి మరియు దర్శకుడు మహేష్ భట్ వాట్స్ అప్ చాట్ బయటపెట్టడం జరిగింది. రియా చక్రవర్తి మరియు మహేష్ భట్ మధ్య సుశాంత్ సింగ్ విషయంపై ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది. మహేష్ భట్ తో రియా చేసిన వాట్స్ అప్ చాట్ లో  సుశాంత్ తో బ్రేక్ అప్ గురించి మాట్లాడడం విశేషం. రియా మాటలను బట్టి చూస్తే సుశాంత్ కి ఆమె బ్రేక్ అప్ చెప్పేలా మహేష్ భట్ ప్రోత్సహించారు అని అర్థం అవుతుంది. 

నన్ను బంధనాలు నుండి మీరు విముక్తిరాలిని  చేశారు అని రియా చక్రవర్తి మహేష్ భట్ కి సందేశం పంపగా, దానికి సమాధానంగా మహేష్ భట్..ఇక గతం వైపుకు చూడకు అని రిప్లై ఇచ్చారు. మహేష్ భట్ మాటలు తనను ఎంతో ప్రభావితం చేశాయని, ఆయన అపరిమిత ప్రేమ తన మనసు లోతుల్లోకి వెళ్లిందని రియా చాట్ లో చెప్పడం జరిగింది. సుశాంత్ రిలేషన్ లో ఉన్న రియా చక్రవర్తి ప్రతి విషయం మహేష్ భట్ తో పంచుకునేదని వీరి వాట్స్ అప్ చాట్ ద్వారా తెలుస్తుంది. 

మహేష్, రియా వాట్స్ అప్ చాట్ తరువాత ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసినట్లు అయ్యింది. దర్శకుడు మహేష్ భట్ తో రియాకు ఎప్పటి నుండో ఎఫైర్ ఉందని పుకార్లు ఉన్న నేపథ్యంలో, సుశాంత్ మరణంలో వీరిద్దరి ప్రమేయంపై అనుమానాలు రేగుతున్నాయి. ఇక ఇప్పటికే సుశాంత్ మరణం వెనుక నిజాలు నిగ్గు తేల్చాడానికి సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసుపై సీరియస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ కేసులో రియా మరింత ఇరుక్కునే సూచనలు కనిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 23: విశ్వ‌క్‌కు షాకిచ్చిన అమూల్య.. మరొక ప్లాన్‌తో పెళ్లి చెడగొట్టేందుకు రెడీ
Gunde Ninda Gudi Gantalu: వామ్మో రోహిణీ మామూలు ఆడది కాదు, నిమిషంలో ప్లేట్ తిప్పేసింది, మరోసారి బకరా అయిన మనోజ్