ఎన్నికలకు ముందు గప్ చుప్ కానీ ఇప్పుడు..!

By Udayavani DhuliFirst Published Dec 11, 2018, 9:09 PM IST
Highlights

అధికారంలో ఉన్నవారితో అంటిపెట్టుకొని తిరగడం, లేకపోతే వారి లెక్కచేయకపోవడం సినీ సెలబ్రిటీలకు వెరీ కామన్. ఇదే విషయం మరోసారి ముందస్తు ఎన్నికల ద్వారా  రుజువైంది.

అధికారంలో ఉన్నవారితో అంటిపెట్టుకొని తిరగడం, లేకపోతే వారి లెక్కచేయకపోవడం సినీ సెలబ్రిటీలకు వెరీ కామన్. ఇదే విషయం మరోసారి ముందస్తు ఎన్నికల ద్వారా 
రుజువైంది.

2014 లో కేసీఆర్ అధికారంలోకి రాగానే సినిమా వాళ్లంతా వారి చుట్టూ తిరిగారు. ఎప్పుడైతే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాడని తెలిసిందో సినిమా వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. ఎన్నికలకు ముందు సినీ నటులు ఎవరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కామెంట్స్ చేయలేదు.

మహాకూటమి బరిలో నిలబడడంతో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే ఫలితాలపై క్లారిటీ రావడంతో ఇక సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. టీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్, కేటీఆర్ లను పొగుడుతూ ట్వీట్లు పెట్టడం మొదలుపెట్టారు. మోహన్ బాబు.. కేసీఆర్ గెలవాలని దేవుడ్ని మొక్కుకున్నట్లు చెప్పారు.

బీజేపీ నాయకుడు కృష్ణంరాజు, హీరో రామ్, సందీప్ కిషన్, నాని ఇలా చాలా మంది ఇప్పటివరకు కంట్రోల్ చేసుకున్న ఎమోషన్స్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి సినీ సెలబ్రిటీలు మరోసారి తమ తెలివితేటలను చూపించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
 

click me!