షూటింగ్ తో ఫుల్ బిజీ, విచారణకు రాలేను.. ఈడీకి మహేష్ బాబు లేఖ 

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీ లాండరింగ్ వ్యవహారంలో మహేష్ బాబు కూడా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Google News Follow Us

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీ లాండరింగ్ వ్యవహారంలో మహేష్ బాబు కూడా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ కేసుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మహేష్ బాబు ఏప్రిల్ 28న విచారణకి హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. 

అయితే తాజాగా మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. ఏప్రిల్ 28న విచారణకు రాలేనని లేఖలో పేర్కొన్నారు. తాను షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల విచారణకు హాజరు కావడం కుదరడం లేదని మహేష్ తెలిపారు. విచారణకి మరో డేట్ ఫిక్స్ చేయాలని మహేష్ లేఖలో ఈడీని కోరారు. మహేష్ రిక్వస్ట్ పై ఈడీ నుంచి రిప్లై రావలసి ఉంది. 

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఈడీ ఈనెల 16న రైడ్ చేసింది. ఈ సంస్థల్లో 100 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సాయి సూర్య డెవలపర్స్ సంస్థకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటనల్లో నటించినందుకు రూ. 5.9 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అయితే ఈ రెమ్యునరేషన్ విషయంలో కూడా అధికారులకు సందేహాలు ఉన్నాయి. అందుకే మహేష్ ని విచారణకు పిలిచారు. 

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రం SSMB 29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బిజీగా సాగుతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆఫ్రికా అడవులు నేపథ్యంలో జరిగే మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ గా ఈ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నారు. 

Read more Articles on