Shruti Haasan: బెంజ్‌ టు లోకల్‌ ట్రైన్‌ ప్రయాణం.. శృతిహాసన్‌ మనసుకు గాయం!  

Published : Apr 27, 2025, 01:58 PM IST
Shruti Haasan: బెంజ్‌ టు లోకల్‌ ట్రైన్‌ ప్రయాణం.. శృతిహాసన్‌ మనసుకు గాయం!  

సారాంశం

Shruti Haasan: కమల్‌ హాసన్ కుమార్తె శృతి హాసన్‌ తన గ్లామర్‌తోపాటు నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు మంచి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌ సినిమాల కంటే.. బాలివుడ్‌పై కన్నేసింది శృతి. పాన్ ఇండియా స్టేటస్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు విడిపోయినప్పుడు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని చాలా ఎమోషనల్‌ అయ్యారు.   

అసలు సినిమాలకు రావలనుకున్నప్పుడు అనే విషయాలపై అవగాహన పెంచుకున్న తర్వాత వచ్చినట్లు శృతి చెప్పుకొచ్చింది. కమల్‌ హాసన్‌ వారసురాలిగా వచ్చానని, ఆయన కల నిలబెట్టాలన్నది తన ఆశయం అని అంటోంది. సినిమాల్లో తన తండ్రి ఓ లెజెండ్ అని, అతనిలా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కుదడం లేదని అంటున్నారు శృతి. అయితే.. నటనలో ఆయన్ను మ్యాచ్ చేయలేనని చెబుతోంది. 



శృతిహాసన్ లాస్ట్‌ సినిమా సలార్. ఆ తర్వాత తెలుగులో వేరే సినిమా చెయ్యలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్, కోలీవుడ్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. అవి షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఇక టావీవడ్‌కి సలార్-2తోనే మళ్లీ ఎంట్రీ ఇవ్వనుంది ఈ బ్యాటీ. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. 

శృతిహాసన్‌ తన తల్లిదండ్రులు విడిపోవడం గురించి ప్రస్తావిస్తూ.. ఎమోషనల్‌గా మాట్లాడింది. తన తల్లిదండ్రులు విడిపోతారని కలలో కూడా ఊహించలేదట. వారి విడాకులు బాధ కలిగించాలని శృతి అంటోంది. ఇద్దరూ విడిపోయిన తర్వాత... అమ్మతో పాటు తాను ముంబయికి వచ్చినట్లు చెప్పింది.


అప్పటి వరకు బెంజి కార్లలో విలాసవంతమైన జీవితం గడిపిన తనకు ఒక్కరోజులో పరిస్థితి తారుమారు అయ్యిందని శృతిహాసన్‌ చెప్పింది. బెంజి కార్లలో వెళ్లాల్సిన తను.. ఎక్కడకు వెళ్లాలన్నా లోకల్ ట్రైన్లలోనే కాలేజి వెళ్లినట్లు పేర్కొంది. తల్లిదండ్రుల విడాకులతో ఒక్కసారిగా లైఫ్‌ మారిపోయిందని అంటోంది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక.. తండ్రితో కలిసి ఉంటున్నట్లు శృతి చెబుతోంది.. ఆయన కూడా ప్రేమగా చూసుకుంటున్నారని హ్యాపీగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bharani: తన ఒరిజినాలిటీ బయటపెట్టిన భరణి.. మెగా బ్రదర్‌ నాగబాబు స్ట్రాటజీ పనిచేస్తుందా?
Akira Nandan నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ క్రేజీ రియాక్షన్‌