SSMB28 నైజాం రైట్స్ ఆఫర్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

Published : Jan 30, 2023, 03:40 PM IST
SSMB28 నైజాం రైట్స్ ఆఫర్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

సారాంశం

తన మార్క్‌   ఎమోషనల్‌ డ్రామాతో ఈసారి కూడా ప్రేక్షకులను మెస్మరైజ్  చేయడానికి త్రివిక్రమ్‌ సిద్ధమవుతున్నాడు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో  చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్  ప్రతిష్టాత్మకంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.   మహేష్‌ కెరీర్‌లో 28వ సినిమాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. అందులోనూ 11 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి మూవీ చేస్తుండటంతో ఇది పక్కా బంపర్‌ హిట్‌ అని అభిమానులు ఓ అంచనాకు వచ్చేశారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఆల్రెడీ ప్రారంభమైపోయింది.

అందుతున్న సమాచారం మేరకు  #SSMB28 నైజాం రైట్స్ దిల్ రాజు 50 కోట్లకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరో ప్రక్క ఏషియన్ సునీల్ సిండికేట్...48 కోట్లు ఆఫర్ చేసారని, నెగోషియేషన్స్ జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఎవరికి ఈ చిత్రం రైట్స్ వెళ్లబోతున్నాయనేది తెలియాల్సి ఉంది. అయితే ముందుగా భావించినట్లు ఈ సినిమాను  సమ్మర్‌లో రిలీజ్‌ చేసే అవకాశాలు కనిపించడం లేదు. 

మహేష్ చెప్పినట్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, షూటింగ్‌ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. త్రివిక్రమ్ ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నారు.  తన మార్క్‌   ఎమోషనల్‌ డ్రామాతో ఈసారి కూడా ప్రేక్షకులను మెస్మరైజ్  చేయడానికి త్రివిక్రమ్‌ సిద్ధమవుతున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తర్వాత మహేష్‌ ఎలాగూ రాజమౌళితో హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేయనున్నాడు. ఈ సినిమాలో మహేస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. మహేష్ పూర్తిగా ఓ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు.
 
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.
 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Feb 26: ప్రేమ నగలతో నర్మద, అడ్డంగా ఇరికించేసిన వల్లి, భాగ్యం
Gunde Ninda Gudi Gantalu:ప్రభావతితో పూలు అమ్మించిన మీనా,బొమ్మల కొలువులో రోహిణీ నెత్తిన మరో బాంబు