మహేష్ బాబు కోసం స్పెషల్ సెట్, నెక్ట్స్ షెడ్యుల్ డేట్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్..?

Published : Feb 26, 2023, 02:09 PM ISTUpdated : Feb 26, 2023, 02:24 PM IST
మహేష్ బాబు కోసం స్పెషల్ సెట్, నెక్ట్స్ షెడ్యుల్ డేట్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్..?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు  నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దానికి సన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు డేట్ కూడా ఫిక్స్ చేశారట మేకర్స్. 

సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ కు రెడీ అవుతోంది. అయితే ఈసారి షెడ్యూల్ ను పక్కా గా ప్లాన్ చేస్తున్నారట టీమ్. ఈసారి లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. అంతే కాదు ఈషెడ్యూల్ కోసం స్పెషల్ గా సెట్ ను కూడా రెడీ చేస్తున్నారట టీమ. ఈనెల 27 నుంచి న్యూ షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇక ఈ స్సెషల్ షెడ్యూల్ షూటింగ్ కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ ఆధ్వర్యంలో స్పెషల్ గా ఓ ఇంటి సెట్ ను ఏర్పాటు చేశారట టీమ్. ఈ ఇంట్లో.. మెయిన్ తారగణంతో.. మహేష్ బాబుకు సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారట. దీనికోసం త్రివిక్రమ్ టీమ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు. ఇక ఈసినిమాలో మహేష్ బాబు తాత పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

సూపర్ ఫాస్ట్ గా ఈసినిమాను కంప్లీట్ చేసి..  వచ్చే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 11, 2023న ప్రపంచవ్యాప్తంగా భారీ స్తాయిలో  విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 28, 2023 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది టీమ్.  దాదాపుగా ఓ 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వ
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?