పరశురాంతో మహేష్ బాబు ఫిక్స్.. మరో భారీ ప్రాజెక్ట్ రెడీ!

Published : Sep 04, 2019, 04:14 PM ISTUpdated : Sep 04, 2019, 04:19 PM IST
పరశురాంతో మహేష్ బాబు ఫిక్స్.. మరో భారీ ప్రాజెక్ట్ రెడీ!

సారాంశం

‘సోలో’ సినిమాతో క్లీన్ హిట్ అందుకున్న దర్శకుడు పరుశురాం.. విజయ్ దేవరకొండ, రష్మిక జోడీగా నటించిన ‘గీతగోవిందం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ అందుకున్నారు.  

దర్శకుడు పరశురాం 'గీత గోవిందం' లాంటి ఇండస్ట్రీ హిట్ తీసినప్పటికీ ఏడాది కాలంగా ఖాళీగా ఉంటున్నాడు. ఇప్పటివరకు తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. మహేష్ బాబుకి కథ వినిపించాడు కానీ ఆ విషయంపై క్లారిటీ లేదు.

ఎట్టకేలకు పరశురాం సినిమా ఓకే అయినట్లు సమాచారం. అది కూడా మహేష్ బాబుతోనే అని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత పరశురాం సినిమా ఉంటుందని సమాచారం. ఇటీవల మహేష్ ని కలిసి పరశురాం పూర్తి కథ వినిపించాడట.

పరశురాం కథను ట్రీట్ చేసిన విధానం మహేష్ కి నచ్చిందట. పైగా అతడి వద్ద బౌండెడ్ స్క్రిప్ట్ ఉండడంతో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఉండాలి. కానీ అల్లు అరవింద్ కి ఈ కథ మీద నమ్మకం లేదట. అందుకే ఇప్పుడు ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ చేతికి చిక్కింది.

పరసురాం, మహేష్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ కాంబో సినిమా పక్కా అని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పనులను మొదలుపెట్టినట్లు సమాచారం.  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?