బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ‘పృథ్వీరాజ్’ నుంచి ఫస్ట్ సింగిల్.. దూసుకెళ్తున్న ‘హ‌రి హ‌ర’ తెలుగు వెర్షన్..

Published : May 12, 2022, 04:55 PM IST
బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ‘పృథ్వీరాజ్’ నుంచి ఫస్ట్ సింగిల్..  దూసుకెళ్తున్న ‘హ‌రి హ‌ర’ తెలుగు వెర్షన్..

సారాంశం

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్ష‌య్ కుమార్ (Akshay Kumar) తాజాగా నటించిన చిత్రం ‘పృథ్వీరాజ్’. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.   

సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, 2017 మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ (Manushi Chhillar) జంటగా నటిస్తున్న చిత్రం ‘పృథ్వీరాజ్’.  ఈ చారిత్రాత్మక చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చంద్రప్రకాష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిిత్రం అత్యంత పరాక్రమ  ధైర్య సాహసాలు కలిగి ఢిల్లీ ని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఢిల్లీ సామ్రాజ్యంపై అత్యంత క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన పురాణ యోధుని పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. 

అయితే ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘హరి హర్’ను రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలోని మొదటి పాటగా ఈ సాంగ్ ను అక్షయ్ కుమార్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. పృథ్వీరాజ్ చౌహాన్ పట్టుదల, బలమైన కాంక్ష ఈపాటలో ప్రతిబింబిస్తున్నాయి. ఈ సాంగ్ పై అక్షయ్ కుమార్ మాట్లాడుతూ తన  నటనా జీవితంలో ఇప్పటి  వరకు అత్యంత దేశభక్తి నిండి ఉన్న పాట ‘హరి హర్’ అని తెలిపారు. ఈ  సినిమాకే ఫస్ట్  సింగిల్ ప్రాణం లాంటిదన్నారు.  ఈ సాంగ్ కు వరుణ్ గ్రోవర్ లిరిక్స్ అందించగా, ఆదర్స్ షిండే అద్భుతంగా పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ ఎహ్సాన్ లాయ్ బ్రహ్మండమైన సంగీతం అందించారు. 

మూడేండ్ల కింద రాజస్థాన్ రాష్ట్రంలో ఈ హిస్టారికల్ చిత్రం షూటింగ్ ను ప్రారంభించారు. 2019 నుంచి రెగ్యూలర్ షూటింగ్ షురూ అయ్యింది. ఆ తర్వాత 2020 మార్చిలో కరోనా వైరల్ వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. మళ్లీ 7 నెలల విరామం తర్వాత  అక్టోబర్ లో షూట్ పున: ప్రారంభమైంది. గతేడాది ఫిబ్రవరిలోనే ఈ చిత్రాన్ని సంబంధించిన పూర్తి షూటింగ్ పార్ట్ ముగిసింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టారు. 

అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ ‘చాణిక్య’ని  తెరకెక్కించిన డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది ‘పృథ్వీరాజ్‌’ సినిమాకి దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ భార్య సంయోగిత పాత్రలో మనుషి చిల్లర్  కనిపించనుంది. ఈ చిత్రంతో మనుషి సినీ  రంగ ప్రవేశం చేస్తోంది.    ఈ చిత్రం జూన్ 3న హిందీతో పాటు తమిళం, తెలుగు భాషలో ప్రపంచవ్యాప్తంగా  విడుదల కానుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu: `వారణాసి` కోసం మహేష్‌ బాబు సాహసం.. కెరీర్‌లోనే మొదటిసారి ఇలా.. తెలిస్తే గూస్‌ బంమ్స్
850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం