సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ రెడీ చేస్తున్నారు. అభిమానులు దిల్ కుష్ అయ్యేలా.. అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ మహేష్ ఏం ప్లాన్ చేశాడు.
సర్కారువారి పాట సినిమాతో ఈ నెల 12 న థియేటర్లను పలుకరించాడు మహేశ్ బాబు. ప్లాప్ టాక్ వచ్చినా.. తొలి రోజునే రికార్డుస్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టింది సర్కారువారి పాట. జనాలకు స్లోగా ఎక్కింది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లోను ఈ సినిమా గట్టి వసూళ్లనే రాబడుతోంది. ఇక ఈసినిమా విజయోత్సవ సభను కూడా కర్నూల్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు టీమ్. సూపర్ స్టార్ ఈ ఈవెంట్ లో స్టెప్ వేసి.. తన ఆనందాన్ని చూపించుకున్నారు.
ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నా మహేష్. ఇక త్వరలోనే త్రివిక్రమ్ తో మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే త్రివిక్రమ్ - మహేశ్ బాబు సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాదు ఈసినిమా టైటిల్ ఏంటా అని కూడా ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ విషయంలో పెద్దగా సస్పెన్స్ లో పెట్టరు, తన ప్రతీ సినిమా విషయంలో ముందే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారు. ఇక జులైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 31న ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
మహేష్ బాబుకు ఆయన తండ్రి కృష్ణ పుట్టిన రోజు సెంటిమెంట్ ఉంది. ఇక ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు 28వ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్టు చెబుతున్నారు. సర్కారు వారి పాట కు కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు మహేష్. ఈసారి కూడా అదే చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను సూపర్ ఫాస్ట్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు మహేష్. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు.
ఇక హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మించబోతున్న ఈ సినిమాలో, మహేశ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే తమన తన పని మొదలు పెట్టినట్టు తెలుస్తొంది. ఈసారి కూడా మహేష్ కు అదిరిపోయే బాణీలు ఇవ్వాలి అని చూస్తున్నాడు తమన్. అంతే కాదు త్వరలో ఇతర వివరాలు కూడా వెల్లడించే ఛాన్స్ ఉంది.