
తెలుగు చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. టాలీవుడ్ కి రెండు కళ్లుగా చెప్పుకునే ఎన్టీఆర్(NTR), ఏఎన్ఆర్ తమ తమ వారసత్వ సామ్రాజ్యాలు నిర్మించిపోయారు. ఏఎన్ఆర్ (ANR)లెగసీని కొడుకు నాగార్జున ముందుకు తీసుకెళ్లారు. టాప్ స్టార్ గా ఎదిగి తండ్రి వారసత్వం నిలబెట్టారు. నాగార్జున తర్వాత పరిశ్రమకు పరిచయమైన సుమంత్, సుశాంత్ ఏమంత ప్రభావం చూపించలేకపోతున్నారు. నాగార్జున కొడుకులు చైతన్య, అఖిల్ మాత్రం తమ మార్క్ క్రియేట్ చేశారు. చైతన్య ఇప్పటికే హీరోగా నిలదొక్కుకున్నాడు. అఖిల్ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు.
ఇక నాగ చైతన్య, సమంత (Samantha)విడాకుల వ్యవహారం ఈ కుటుంబంలో కొంత అలజడి సృష్టించింది. ప్రేమ వివాహం చేసుకున్న చైతూ-సామ్ నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నాగ చైతన్య విడాకుల తర్వాత మొదటిసారి నాగార్జున ఫ్యామిలీ మొత్తం ఓ చోట గ్యాదర్ అయ్యారు. ఈ ఫోటోలో దాదాపు అక్కినేని ఫ్యామిలీ మొత్తం సభ్యులు ఉన్నారు. సుమంత్, సుశాంత్, నాగార్జున(Nagarjuna), అమల, నాగ చైతన్యతో పాటు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు.
సాధారణంగా పండుగకు కుటుంబ సభ్యులు కలవడం ఆనవాయితీ. పండగ పబ్బం కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓ చోట చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అక్కినేని హీరోలలో సుమంత్, నాగ చైతన్య, సుశాంత్, అఖిల్ (Akhil)వివాహం జరగాల్సి ఉంది. సుమంత్ చాలా కాలం క్రితం హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు. నాగచైతన్యకు సమంతతో డైవర్స్ అయ్యాయి. ఈ క్రమంలో కుటుంబంలో ఎవరిదైనా పెళ్లి విషయమై అందరూ కలిశారా? అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఫ్యామిలీ ఫొటోలో అక్కినేని అఖిల్ మిస్ అయ్యాడు. ప్రస్తుతం అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ తెరకెక్కుతుంది. ఇటీవల వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్దమవుతుంది. అలాగే నాగ చైతన్య (Naga Chaitanya)బిజీగా ఉన్నారు. ఆయన సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు చేస్తున్నారు.