Guntur Kaaram Update : ‘గుంటూరు కారం’ అప్డేట్ వచ్చేసింది.. ఏంటో తెలుసా?

Published : Feb 11, 2024, 06:26 PM IST
Guntur Kaaram Update : ‘గుంటూరు కారం’ అప్డేట్ వచ్చేసింది.. ఏంటో తెలుసా?

సారాంశం

‘గుంటూరు కారం’ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.  

సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ Trivikram కాంబోలో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’ Guntur Kaaram.  హారిక అండ్ హాసిని బ్యానర్ లో గ్రాండ్ గా విడుదలైంది. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా Sreeleela, క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అలరించారు. అందంతో ఆకట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్, సునిత్, జయరాం, రమ్యక్రిష్ణ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఇదిలా ఉంటే.. గుంటూరు కారం నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఈ చిత్రంలో ఎంతో సెన్సేషన్ గా మారిన ‘కుర్చీ మడతపెట్టి’ Kurchi Madathapetti Song సాంగ్ తాజాగా విడుదలైంది. ఈ సాంగ్ పూర్తి వీడియో కోసం అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ ఫుల్ సాంగ్ యూట్యూబ్ లో విడుదలైంది. మహేశ్ బాబు, శ్రీలీలా ఊరమాస్ స్టెప్పులు అదిరిపోయాయి. థమన్ అందించిన ట్యూన్ కు స్టార్స్ తమ డాన్స్ తో అదరగొట్టారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ లోకి వస్తోంది. ఈపాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సాహితీ చాగంటి, శ్రీ కృష్ణ పాడారు. థమన్ క్యాచీ ట్యూన్ అందించారు. శేఖర్ వీజే కొరియోగ్రఫీతో దుమ్ములేపారు. 

నెక్ట్స్ మహేశ్ బాబు దర్శకధరీడు ఎస్ఎస్ రాజమౌళి SS Rajamouli డైరెక్షన్ లో నటించబోతున్నారు. SSMB29గా రానున్న ఈ చిత్రం త్వరలో అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇక.. గుంటూరు కారం విషయానికొస్తే.. రీజినల్ ఫిల్మ్స్ లో ఈ చిత్రం తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. సినిమాను ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?