ముగ్గురు అమ్మాయిలతో ఎనిమిదేళ్లు సీరియస్ లవ్, అందరూ ఇండస్ట్రీకి చెందినవారే!


హీరో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తన లవ్ మ్యాటర్ బయటపెట్టాడు. పరిశ్రమకు చెందిన ముగ్గురు అమ్మాయిలను ప్రేమించినట్లు చెప్పుకొచ్చాడు. 
 



సందీప్ కిషన్ హిట్ కోసం తపిస్తున్నాడు. భిన్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ ఎంత కష్టపడినా బ్రేక్ రావడం లేదు. ఈసారి ఆయన సస్పెన్సు హారర్ జోనర్ ని ఎంచుకున్నారు. ఊరు పేరు భైరవకోన టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఈ మూవీ ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ఊరు పేరు భైరవకోన చిత్రానికి వి ఐ ఆనంద్ దర్శకుడు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో హీరో సందీప్ కిషన్ పాల్గొంటున్నారు. 

మీడియా సమావేశంలో పాల్గొన్న సందీప్ కిషన్ మూవీకి సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు. అలాగే తన లవ్ ఎఫైర్స్ గురించి కూడా స్పందించారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ... నేను ముగ్గురు అమ్మాయిలను ప్రేమించాను. ఒక అమ్మాయితో నాలుగేళ్లు రిలేషన్ లో ఉన్నాను. మరో అమ్మాయి తో రెండేళ్లు, ఇంకో అమ్మాయితో రెండేళ్లు సీరియస్ రిలేషన్ నడిచింది. 

Latest Videos

కానీ ఒక్కటి కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు నేనున్న పొజిషన్ లో ఆలోచిస్తే ప్రేమ అంత ముఖ్యం కాదు అనిపిస్తుంది. నేను ప్రేమించిన ముగ్గురు ఇండస్ట్రీ అమ్మాయిలే. ఏళ్ల తరబడి రిలేషన్ నడిచినా ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచాను. నాకు రెజీనాకు మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు, అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. 

సందీప్ కిషన్-రెజీనా జంటగా రారా కృష్ణయ్య మూవీలో జంటగా నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇక సందీప్ కిషన్ కెరీర్ లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అతిపెద్ద హిట్ గా ఉంది. ఆ రేంజ్ హిట్ సందీప్ కిషన్ కి మరలా పడలేదు. సందీప్ తమిళ్ కూడా చిత్రాలు చేస్తున్నారు, ధనుష్ కెప్టెన్ మిల్లర్ లో కీలక రోల్ చేశాడు. 

click me!