MaheshBabu:యానిమల్ ట్రైలర్ చూశా, మెంటల్ వచ్చేసింది అంతే.. ఫోన్ కూడా కిందపడేశా, ప్రీ రిలీజ్ లో మహేష్ బాబు

Published : Nov 27, 2023, 11:35 PM IST
MaheshBabu:యానిమల్ ట్రైలర్ చూశా, మెంటల్ వచ్చేసింది అంతే.. ఫోన్ కూడా కిందపడేశా, ప్రీ రిలీజ్ లో మహేష్ బాబు

సారాంశం

యానిమల్ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ గూస్ బంప్స్ తెప్పించే కామెంట్స్ చేశారు.

సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ మూవీ అందించి తన ప్రత్యేకత చాటుకున్నారు. దీనితో సందీప్ తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం సందీప్.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో యానిమల్ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.   

భారీ అంచనాలతో యానిమల్ చిత్రం డిసెంబర్ 1 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు పెంచడమే కాదు.. సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది.  తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని ఇంత వయలెంట్ గా కూడా చూపించవచ్చా అంటూ బాలీవుడ్ వాళ్ళు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే యానిమల్ చిత్రానికి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మోతమోగిపోతున్నాయి. 

ఈ జోరు మరింత పెంచుతూ నేడు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. యానిమల్ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ గూస్ బంప్స్ తెప్పించే కామెంట్స్ చేశారు. ఈ మూవీలో సందీప్ చూపించింది యూనిక్. 

మొన్నే ట్రైలర్ చూశా.. మెంటల్ వచ్చేసింది. ఇంత ఒరిజినల్ ట్రైలర్ నేను ఇంతవరకు ట్రైలర్ చూడలేదు. సందీప్ వంగ ఒరిజినల్ ఫిలిం మేకర్. అలాగే ఈ చిత్రంలో నటించిన బాబీ డియోల్, అనిల్ కపూర్ పై కూడా మహేష్ ప్రశంసలు కురిపించాడు.కొన్ని సీన్స్ చూసి ఫోన్ కూడా కింద పడేశా అని మహేష్ అన్నారు.   రణబీర్ కి నేని పెద్ద ఫ్యాన్ ని.. ఇండియాలో రణబీర్ బెస్ట్ యాక్టర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు మహేష్.  ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. రష్మిక పేరు చెప్పడం మరచిపోయిన మహేష్ వెంటనే మైక్ తీసుకుని.. ఆమెని కూడా ప్రశంసించాడు. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్