Bigg Boss7: యావర్ దగ్గర బుక్కైన శోభా శెట్టి.. తల తీసేసినా శివాజీ అలాంటివాడే అని చెబుతా, రెచ్చిపోయిన గౌతమ్ 

By Asianet NewsFirst Published Nov 27, 2023, 11:07 PM IST
Highlights

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో 86వ ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్స్ లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదాలు తారా స్థాయికి చేరాయి.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో 86వ ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్స్ లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదాలు తారా స్థాయికి చేరాయి. ముఖ్యంగా శివాజీ, గౌతమ్.. శోభా శెట్టి, ప్రశాంత్.. ప్రియాంక, ప్రశాంత్ మధ్య మాటల యుద్ధం మరో స్థాయికి వెళ్ళింది. 

ముందుగా ప్రశాంత్.. శోభా శెట్టి, ప్రియాంక లని నామినేట్ చేశాడు. ఆ తర్వాత గౌతమ్ శివాజీని నామినేట్ చేస్తూ అనేక పాయింట్స్ చెప్పాడు. శివాజీ అన్నతో నా ప్రాబ్లెమ్స్ ఉన్నాయి. ఆయన ఆయనకి కంఫర్టబుల్ గా ఉండే వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు.  మొదటి నుంచి నాకు అడ్డుపడుతూనే ఉన్నారు అని గౌతమ్ ఫైర్ అయ్యాడు. దీనికి శివాజీకూడా ధీటుగానే బదులిచ్చాడు. 

Latest Videos

ప్రియాంక కూడా శివాజీనే నామినేట్ చేసింది. నాకు మీరు సపోర్ట్ చేసారు కానీ అంతకంటే ఎక్కువ నెగిటివిటి పెట్టుకున్నారు అని ప్రియాంక తెలిపింది. నేను నెగిటివిటి పెట్టుకోవడం కాదు హౌస్ లో కిచెన్ లో అందరూ నెగిటివ్ అయ్యేలా చేసేది నువ్వే అంటూ శివాజీ కౌంటర్ ఇచ్చారు. అలాగే ప్రియాంక ప్రశాంత్ ని కూడా నామినేట్ చేసింది. 

ఇక యావర్.. గౌతమ్ ని నామినేట్ చేసి.. నువ్వు నేను స్టెరాయిడ్స్ తీసుకుంటున్నట్లు తప్పుగా మాట్లాడావ్ అని యావర్ అన్నాడు. ఇంతలో శివాజీ గురించి చర్చ రాగా నా తల తీసేసినా శివాజీ గురించి అలాగే మాట్లాడతా అని గౌతమ్ అన్నాడు. 

శోభా శెట్టి యావర్ ని నామినేట్ చేస్తూ.. నువ్వు బాల్కనీలో గేమ్ ఓవర్ శోభా శెట్టి అని రాశావు అది నాకు నచ్చలేదు అని తెలిపింది. ప్రశాంత్ నవ్వుతూ నేను రాశానా.. నువ్వు చూశావా అని యావర్ ప్రశ్నించాడు. నేను చూశాను అని మొదట చెప్పిన శోభా శెట్టి.. ఆ తర్వాత చూడలేదు అంటూ అడ్డంగా బుక్కైంది. నాకు తెలుసు నువ్వే రాసావు అని చెప్పింది. 

మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో అమర్ దీప్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు. ప్రశాంత్, శివాజీ, గౌతమ్, ప్రియాంక, యావర్, అర్జున్, శోభా శెట్టి నామినేట్ అయ్యారు. 

click me!