Animal Movie: వెరీ రేర్.. తెలుగు రాష్ట్రాల్లో 'యానిమల్' 6 AM షోలు కంఫర్మ్

Published : Nov 27, 2023, 08:16 PM IST
Animal Movie: వెరీ రేర్.. తెలుగు రాష్ట్రాల్లో 'యానిమల్' 6 AM షోలు కంఫర్మ్

సారాంశం

భారీ అంచనాలతో యానిమల్ చిత్రం డిసెంబర్ 1 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు పెంచడమే కాదు.. సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది.  

సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ మూవీ అందించి తన ప్రత్యేకత చాటుకున్నారు. దీనితో సందీప్ తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం సందీప్.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో యానిమల్ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.   

భారీ అంచనాలతో యానిమల్ చిత్రం డిసెంబర్ 1 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు పెంచడమే కాదు.. సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది.  తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని ఇంత వయలెంట్ గా కూడా చూపించవచ్చా అంటూ బాలీవుడ్ వాళ్ళు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే యానిమల్ చిత్రానికి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మోతమోగిపోతున్నాయి. బాలీవుడ్ హీరో చిత్రానికి ఇదేం విధ్వంసం అంటూ అంతా శాఖ అవుతున్నారు. ఇది సందీప్ రెడ్డి వంగ మ్యాజిక్ అని చెప్పడంలో సందేహం లేదు. చూస్తుంటే ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులు కూడా నమోదు చేసేలా ఉంది. 

దీనికి తోడు పరిస్థితులు కూడా యానిమల్ చిత్రానికి అనుకూలంగా వెళుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ చిత్రానికి ఉదయం 6 గంటల షోలకు అనుమతి లభించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే పైడ్ ప్రీమియర్ షోల గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఉదయం 6 గంటలకే ఒక బాలీవుడ్ హీరో సినిమా తెలుగు రాష్ట్రాల్లో షోలు ఖరారు కావడం వెరీ రేర్ అనే చెప్పాలి. ప్రీమియర్స్ కూడా ఒకే అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ ఊహకి అందండం కూడా కష్టమే. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు
Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌