మహేష్‌ బాబు మరదలికి కరోనా పాజిటివ్‌, అభిమానులకు నమ్రత శిరోద్కర్‌ చెల్లి రిక్వెస్ట్

Published : May 19, 2025, 05:04 PM IST
shilpa shirodkar

సారాంశం

మహేష్‌ బాబు మరదలు, నమ్రతా శిరోద్కర్‌ చెల్లి శిల్పా శిరోద్కర్‌ కి కరోనా సోకింది. తాజాగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రజలకు రిక్వెస్ట్ చేసింది. 

కరోనా మళ్లీ విజృంభిస్తుంది. హాంకాంగ్‌, చైనా వంటి దేశాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ సారి కొత్త వేరియంట్‌ విజృంభిస్తుందని తెలుస్తుంది. దీంతో పలు దేశాలు ఆందోళనలో ఉన్నాయి. 

అయితే మన దేశంలో ఇప్పటికీ అలాంటి కేసులు నమోదు కాలేదు. ఈ క్రమంలో తాజాగా మహేష్‌ బాబు మరదలికి కారోనా సోకడం షాకిస్తుంది. నమ్రత శిరోద్కర్‌ చెల్లి శిల్పా శిరోద్కర్‌కి కరోనా పాజిటివ్‌ గా తేలింది.

తనకు కరోనా సోకడంతో ప్రజలకు శిల్పా శిరోద్కర్‌ రిక్వెస్ట్

ఈ విషయాన్ని ఆమెనే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, అందరు మాస్కులు ధరించాలని, జాగ్రత్తగా ఉండాలని ఆమె జనాలను రిక్వెస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

మన భారతీయులను కలవర పెడుతుంది. అయితే ఆమె ఇండియాలోనే ఉందా? లేక విదేశాల్లో ఉందా అనేది తెలియాల్సి ఉంది. మహేష్‌ బాబు మరదలికి కరోనా వచ్చిందనే వార్త ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.

తెలుగులో `బ్రహ్మా` సినిమాలో మెరిసిన శిల్పా శిరోద్కర్‌

శిల్పా శిరోద్కర్‌.. మహేష్‌ బాబు భార్య, నటి నమ్రతా శిరోద్కర్‌కి చెల్లి. ఆమె బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. ఇప్పుడు మూవీస్ కి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గతేడాది ఆమె హిందీ బిగ్‌ బాస్‌ 18 షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. 

ఇదిలా ఉంటే శిల్పా తెలుగులోనూ ఓ మూవీ చేసింది. 1992లో `బ్రహ్మా` అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించడం విశేషం. ఇది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్