మహేష్‌ బాబు అన్న రమేష్‌ బాబు కొడుకు హీరోగా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే?

Published : May 19, 2025, 04:22 PM IST
mahesh babu, jaya krishna

సారాంశం

సూపర్‌స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమాల్లోకి రాబోతున్నారు. మహేష్‌ బాబు అన్న రమేష్‌ బాబు కొడుకు హీరోగా పరిచయం కాబోతున్నారు. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. కృష్ణ మనవడు, మహేష్‌ బాబు అన్న రమేష్‌ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నాడు. 

ఇన్నాళ్లు అమెరికా ఫిల్మ్ కోర్స్, యాక్టింగ్‌లో ట్రైన్‌ అయిన జయకృష్ణ ఇటీవలే ఇండియాకి వచ్చారు. ఏడాదిగా ఆయన సినిమా ఎంట్రీకి సంబంధించిన ప్లాన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఫిక్స్ అయ్యిందని సమాచారం.

వైజయంతి, ఆనంది ఆర్ట్స్ బ్యానర్స్ లో రమేష్‌ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా ఎంట్రీ

జయకృష్ణని రెండు బిగ్‌ బ్యానర్స్ పరిచయం చేయబోతున్నాయి. వైజయంతి మూవీస్‌, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా జయకృష్ణని పరిచయం చేయబోతున్నాయి. మరి జయకృష్ణ హీరోగా పరిచయం చేసే దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా డైరెక్టర్‌ కూడా ఫిక్స్ అయ్యాడట.

`ఆర్‌ఎక్స్ 100` దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ ఎంట్రీ

`ఆర్‌ఎక్స్ 100`, `మంగళవారం` ఫేమ్‌ అజయ్‌ భూపతి ఈ మూవీకి దర్శకత్వ వహించబోతున్నారట. జయకృష్ణ హీరోగా ఒక అదిరిపోయే కథతో సినిమా చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతుందని సమాచారం. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి(మే 31) సందర్భంగా జయకృష్ణ హీరోగా ఎంట్రీ ప్రకటన ఉంటుందని తెలుస్తుంది. దీంతో ఇది ఘట్టమనేని అభిమానును ఖుషి చేస్తుంది.

కృష్ణ ఫ్యామిలీ నుంచి సినిమాల్లో ఉన్నది వీళ్లే.. త్వరలో గౌతమ్‌ కూడా

ఇక ఇప్పటికే కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్‌ బాబు, కూతురు మంజుల, ఆమె భర్త, అలాగే అల్లుడు సుధీర్‌ బాబు సినిమాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు మరో వారసుడు సినిమాల్లోకి రాబోతున్నారు.

 అంతేకాదు త్వరలో మహేష్‌ బాబు కొడుకు గౌతమ్‌ ఎంట్రీ కూడా ఉంటుందని, కాకపోతే అందుకు ఇంకా సమయం ఉందని తెలుస్తుంది. సితార కూడా సినిమాలపై ఆసక్తిని చూపిస్తున్న విషయం తెలిసిందే. మరి ఆమెని సినిమాల్లోకి తీసుకొస్తారా? లేదా అనది తెలియాల్సి ఉంది.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్