యుక్త వయసులోని కుర్రాడు, యువకుడు, మధ్య వయస్కుడు.. ఇలా నాగ చైతన్య ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. రాశీ ఖన్నా మెయిన్ లీడ్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అవికా గోర్, మాళవికా నాయర్ కూడా నటించారు.
లవ్ స్టోరి, బంగార్రాజు లతో వరుస హిట్స్ కొట్టిన అక్కినేని హీరో నాగ చైతన్య ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘థాంక్యూ’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధింది టీజర్ రిలీజ్ చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ థాంక్యూ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ టాక్ బయిటకు వచ్చి ఫ్యాన్స్ ని కంగారుపెడుతోంది.
అదేమిటంటే...ఈ సినిమాని డైరక్ట్ ఓటిటి రిలీజ్ కు భారీ ఆఫర్స్ వస్తున్నాయట. దాంతో డైరక్ట్ ఓటిటికు ఇచ్చేద్దామని దిల్ రాజు నిర్ణయించుకున్నారని చెప్తున్నారు. ఈ మేరకు లీడింగ్ ఓటిటి ప్లాట్ ఫామ్ లతో మాట్లాడుతున్నారని, అనుకున్న రేట్ వస్తే ఇచ్చేస్తారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గతంలో దిల్ రాజు నాని చిత్రం వి ని ఇలాగే డైరక్ట్ ఓటీటికి ఇచ్చేసారని గుర్తు చేస్తున్నారు. అయితే అప్పటి పరిస్దితి వేరు. ఇప్పుడు థియోటర్ రిలీజ్ కు కూడా బాగుంది. థాంక్యూ కనుక ఓటిటికు ఇచ్చేస్తే చైతూ కి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. దాంతో నాగార్జున కానీ, నాగచైతన్య కానీ ఈ ప్రపోజల్ కు ఎంత వరకూ ఒప్పుకుంటాడు అనేది క్వచ్చిన్. అయినా ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
ఈ చిత్రానికి బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నారు. యుక్త వయసులోని కుర్రాడు, యువకుడు, మధ్య వయస్కుడు.. ఇలా నాగ చైతన్య ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. రాశీ ఖన్నా మెయిన్ లీడ్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అవికా గోర్, మాళవికా నాయర్ కూడా నటించారు. మరి ఈ సినిమా చైతన్య హ్యాట్రిక్ హిట్ కొడుతారా? అని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మనం తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య చేస్తోన్న చిత్రమిది. ఇప్పుడు ఇదే దర్శకుడితో కలిసి దూత అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు చైతన్య. థాంక్యూ సినిమా విడుదలైన దాదాపు నెల రోజులు తర్వాత అంటే ఆగస్ట్ 11న చైతన్య డెబ్యూ బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా విడుదలవుతుంది. ఇందులో ఆమిర్ ఖాన్ హీరో కాగా.. చైతన్య కీలక పాత్రలో కనిపించనున్నారు.