ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి చేయబోయే సినిమాపై.. ఇప్పటినుంచే అంచనాలు తారాస్థాయికిచేరుతున్నాయి. అందులోనుమహేష్ తో సినిమా కావడంతో అవి రెట్టింపు అవుతున్నాయి. ఇక ఈసారి జక్కన్న సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మూవీ షూటింగ్ కు కూడా ముహూర్తం ఖారారు అయినట్టు సమాచారం.
ఆర్ ఆర్ ఆర్ తో టాలీవుడ్ సినిమాను ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్ళాడు రాజమౌళి. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా వైభవాన్ని చాటాడు. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను గ్లొబల్ స్టార్స్ గా మార్చాడు జక్కన్న. ఎన్నో అంతర్జాతీయ అవార్డ్ లను సాధించి దేశంలో తాను నెంబర్ వన్ గా నిలవడంతో పాటు..టాలీవుడ్ ను కూడా నెంబర్ వన్ గా నిలిపాడు రాజమౌళి. ఇక రాజమౌళి నెక్ట్స్ సినిమాపై అంచనాలుభారీ స్థాయిలో ఉన్నాయి. ఇంత సాధించిన జక్కన్న తరువాత సినిమా ఎలా ఉంటందా అని అంతా వెయిట్ చేస్తున్నారు.ఇక వాటిని రాజమౌళి ఎలా అందుకుంటాడా అనేది ప్రస్తుతం కోటి డాలర్ల ప్రశ్న.
జక్కన్న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. ఇది అందరికి తెలిసిందే. ఈమూవీ ని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. అడ్వెంచర్ మూవీ కావడంతో.. ఈ సినిమాతో హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యూనివర్సల్ అడ్వెంచర్ కథతో .. అంతర్జాతీయ స్థాయి నాన్యతతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. అంతే కాదు ఈసినిమా ప్రపంచ స్థాయిలో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని కూడా రాజమౌళి అనుకుంటునర్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా బిజినెస్ కోసం ఇప్పటికే ఆయన హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. అంతే కాదు ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా రంగంలోకి దింపబోతున్నాడట జక్కన్న.
ఇక ఇప్పటికే ఈమూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్అయ్యాయి. అయిపోతున్నాయి కూడా.. షూటింగ్ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. వచ్చే సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజమౌళి కూడా అదే ఆలోచనలో ఉన్నారట. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాల్ నటిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈమూవీ రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ లో త్రివిక్రమ్ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నాడు మహేష్. వెంటనే గ్యాప్లేకుండా రాజమౌళి సినిమా స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం.