
టాలీవుడ్ డైరెక్టర్ పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ లిరికల్ వీడియో సాంగ్ ఆడియెన్స్ కు ఎంతగానో కనెక్ట్ అయ్యింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘కళావతి’ రొమాంటిక్ సాంగ్ ను అందించారు. ఈ సాంగ్ ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కాగా, నిన్న రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ పెన్నీ Penny కూడా దూసుకుపోతోంది.
ప్రతి పైసాను గౌరవించాలి.. అనే నేపథ్యంలో వచ్చిన ఈ పెన్నీ సాంగ్ కూడా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం 16 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. #1 ట్రెండింగ్ లో పెన్నీ టాప్ లో ట్రెండ్ అవుతోంది. అయితే లాస్ట్ టైమ్ కళావతి, అరబిక్ కుత్తు పోటీ పడ్డాయి. కానీ కళావతి కొంత వ్యూస్ విషయంలో వెనకబడ్డ తెలుగు ఆడియెన్స్ ను మాత్రం వందశాతం రీచ్ అయ్యింది. ప్రస్తుతం విజయ్ మూవీ నుంచి రిలీజ్ అయిన ‘జాలీ ఓ జింఖానా’ సాంగ్, మహేశ్ బాబు సర్కారు వారి పాటలోని ‘పెన్నీ’ సాంగ్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ సారి మహేశ్ బాబు సాంగే ట్రెండింగ్ లో ఉందని, భారీ వ్యూస్ ను సాధించిందంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పెన్నీ రిలీజ్ అయిన పది గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్ ను సాధించింది.
బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మే 12న ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను ముగించుకుంటోంది. ఈ చిత్రానికి పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. మహేశ్ బాబుకు జోడీగా హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆడిపాడనుంది. వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.