2020లో మహేష్ బాబు డబుల్ ధమాకా.. ఆ ఇద్దరు దర్శకులతో!

Siva Kodati |  
Published : May 19, 2019, 05:17 PM IST
2020లో మహేష్ బాబు డబుల్ ధమాకా.. ఆ ఇద్దరు దర్శకులతో!

సారాంశం

మహర్షి చిత్రం విడుదలై సూపర్ హిట్ వసూళ్ళని రాబడుతోంది. మహేష్ కెరీర్ లో మహర్షి చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయవాడలో మహర్షి విజయోత్సవం కూడా ముగిసింది. 

మహర్షి చిత్రం విడుదలై సూపర్ హిట్ వసూళ్ళని రాబడుతోంది. మహేష్ కెరీర్ లో మహర్షి చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయవాడలో మహర్షి విజయోత్సవం కూడా ముగిసింది. దీనితో మహేష్ బాబు కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. జూన్ నుంచి అనిల్ రావిపూడి దర్శకత్వంలోని చిత్రం ప్రారంభం అవుతుంది. 14 రీల్స్ బ్యానర్ లో అనిల్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ ఏడాది చివరికి షూటింగ్ ఫినిష్ చేసి 2020 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మహేష్ గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రం కూడా 2020 లోనే విడుదల కానుంది. ఒకే ఏడాది మహేష్ నటించిన రెండు చిత్రాలు విడుదలైన సందర్భాలు తక్కువ. గత కొన్నేళ్లుగా మహేష్ బాబు ఏడాదికి ఒక చిత్రంలోనే నటిస్తున్నాడు. 

ఇకపై మహేష్ గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని భావిస్తున్నాడట. ఇటీవల మహేష్ బాబు ఎక్కువగా సందేశాత్మక చిత్రాల్లో నటించాడు. ఇకపై కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి, పరుశురాం ఇద్దరూ తెరకెక్కించబోయే చిత్రాలు కమర్షియల్ ఎంటర్ టైనర్సే. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్