నేను కత్రినాకు అన్నయ్యను కాను.. సల్మాన్ ఖాన్ కామెంట్స్!

By AN TeluguFirst Published 19, May 2019, 4:49 PM IST
Highlights

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన భారత్' సినిమాలో తాజాగా జిందా అనే పాటను విడుదల చేశారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన భారత్' సినిమాలో తాజాగా జిందా అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సల్మాన్, కత్రినా కైఫ్ హాజరయ్యారు.

ఈ క్రమంలో ఓ విలేకరి కత్రినాను ప్రశ్నిస్తూ.. 'కత్రినా భాయ్ జాన్ సల్మాన్ తో కలిసి మరోసారి నటించడం మీకు ఎలా అనిపిస్తుంది..?'  అని ప్రశ్నించగా.. దానికి వెంటనే సల్మాన్ మైక్ తీసుకొని 'సర్.. నేను కత్రినాకు భాయ్ జాన్ కాను..' అని అన్నారు. సల్మాన్ సమాధానం విన్నవారంతా పగలబడి నవ్వారు.

ఆ తరువాత సదరు విలేకరి కత్రినాను మరో ప్రశ్న అడిగాడు. 'మీరు సల్మాన్ ని 'భాయ్ జాన్' అనడం ఆయనకు నచ్చడం లేదు.. మరి సల్మాన్ ను ఏమని పిలవాలనుకుంటున్నారు..?' అని అడిగారు. మరోసారి సల్మాన్ ఆ ప్రశ్నకు బదులిస్తూ.. 'నన్ను కత్రినా భాయ్ జాన్ అని పిలవదు.. కానీ 'మేరీ జాన్' అని పిలుస్తుంది' అన్నారు.

దీంతో అక్కడున్న వారంతా అరుస్తూ ఈలలు, కేకలు వేస్తూ సల్మాన్ ని ఆటపట్టించారు. ఇక సినిమా విషయానికొస్తే.. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రంజాన్ కానుకగా జూన్ 7న విడుదల కానుంది.  

Last Updated 19, May 2019, 4:48 PM IST