డైరక్షన్ కాకుండా కేవలం రచనకే త్రివిక్రమ్ ..పది కోట్ల రూపాయలు తీసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏ సినిమాకు అంటే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మూవీకి డైలాగ్స్ రాస్తున్నారట. ఈ స్క్రిప్టుకు రచనా సహకారం, డైలాగ్స్ త్రివిక్రమ్ రాయబోతున్నట్లు సమాచారం. అయితే కేవలం రచనకు పదికోట్లు ఇవ్వటం అనేది తెలుగు పరిశ్రమలోనే కాదు ఇండియన్ పరిశ్రమలోనే చాలా చాలా అరుదైన విషయం.
త్రివిక్రమ్ వంటి స్టార్ రైటర్ పెన్ పెట్టి రాయాలంటే ఎంత తీసుకుంటారు. అదీ పవన్ కళ్యాణ్ సినిమా కు అంటే. అంచనా వేయటం కష్టం కదా. డైరక్షన్ కాకుండా కేవలం రచనకే త్రివిక్రమ్ ..పది కోట్ల రూపాయలు తీసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏ సినిమాకు అంటే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మూవీకి డైలాగ్స్ రాస్తున్నారట. ఈ స్క్రిప్టుకు రచనా సహకారం, డైలాగ్స్ త్రివిక్రమ్ రాయబోతున్నట్లు సమాచారం. అయితే కేవలం రచనకు పదికోట్లు ఇవ్వటం అనేది తెలుగు పరిశ్రమలోనే కాదు ఇండియన్ పరిశ్రమలోనే చాలా చాలా అరుదైన విషయం.
రైట్స్ తీసుకున్నప్పుడు ఈ సినిమాని సింపుల్ గా తెలుగులో చేద్దామని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫిక్సయ్యారు. కానీ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సీన్ లోకి వచ్చాక మొత్తం మారిపోయింది. త్రివిక్రమ్ సినిమాని సమర్పిస్తూ, డైలాగులు రాస్తూండటంతో సినిమా స్పాన్ పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.ఇలాంటి ఎమోషన్ డ్రామాకు సరైన డైలాగులు పడకపోతే సినిమా ఖర్చైపోతుందని నిర్మాతలు కూడా భావించారట.
అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ స్క్రిప్టు త్రివిక్రమ్ చేతుల మీదుగా రూపొందాలని చెప్పారట. అలాగే ఈ ప్రాజెక్టులోకి పవన్ ని తీసుకుని వచ్చింది కూడా త్రివిక్రమ్ అని తెలుస్తోంది. అందుకే ఈ స్దాయి రెమ్యునేషన్ సమంజసమని భావిస్తున్నారట. అయితే ఆ రెమ్యునేషన్ ..సినిమా షేర్ క్రింద ఇస్తారట. తన రెమ్యునేషన్ ని ఈ సినిమాకు పెట్టుబడిగా త్రివిక్రమ్ పెడుతున్నట్లు అన్నమాట.
ఇక సినిమాలోని ఓ కీలకపాత్రలో రానా నటించనున్నారంటూ గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై రానా స్పందించారు. ‘నిజమే.. పవన్ సినిమాలోని ఓ పాత్ర కోసం చిత్రం టీమ్ నన్ను సంప్రదించింది. అయితే అది ఇంకా ఫైనల్ కాలేదు. నిజం చెప్పాలంటే ఆ పాత్ర చేయడం నాక్కూడా ఎంతో ఇష్టం’ అని ఆయన వెల్లడించారు. ‘అయ్యప్పన్ కొషియమ్’ రీమేక్ లో బిజు మేనన్ పోషించిన పాత్రలో పవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నారని సమాచారం.
సచీ దర్శకత్వంలో రూపొందిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` మలయాళంలో సంచలన విజయం సాధించింది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా నటించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవరనాగవంశీ దక్కించుకున్నారు.
మరో ప్రక్క ..సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇటీవలే నితిన్ నటించిన భీష్మ తో పెద్ద హిట్ అందుకుంది. అంతేకాకుండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం నితిన్ ,కీర్తి సురేష్‌లతో రంగ్‌దే, నానితో శ్యామ్ సింగరాయ్. నాగశౌర్యతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగ్‌దే , శ్యామ్ సింగరాయ్ విడుదలకు సిద్దంగా ఉన్నాయి.