Mahesh Babu : మహేశా.. ఇంటర్నెట్ షేక్ చేశావుగా! హైదరాబాద్ తిరిగొచ్చిన సూపర్ స్టార్

మహేశ్ బాబు - రాజమౌళి Raja Mouli సినిమాపైనే ప్రస్తుతం అందరి చూపు  ఉంది. ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.  


సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ29’ SSMB29. ఈ చిత్రానికి మాస్టర్ మైండ్, దర్శకధీరుడు రాజమౌళి Rajamouli దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పుడో ప్రకటించిన ఈ చిత్రం  ఫార్మల్ లాంఛ్ కు సిద్ధమవుతోంది. అయితే ఎప్పుడెప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా? అని అభిమానులు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. చివరిగా బాబు ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి కూడా రానుంది. 

ఇదిలా ఉంటే SSMB29 కోసం బాబు రీసెంట్ గా జర్మనీకి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయని అంటున్నారు. ఆఫ్రికా అడవుల్లో ఈ యాక్షన్‌-అడ్వెంచర్‌ ఉంటుందన్న క్రమంలో కొన్ని విద్యల్లో ట్రెయిన్ అయినట్టు తెలుస్తోంది. అక్కడ పని ముగించుకొని బాబు రిటర్న్ అయ్యారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. 

Latest Videos

ఈ సందర్భంగా మహేశ్ బాబు న్యూ లుక్ లో దర్శనమిచ్చారు. స్టైలిష్ అండ్ మాస్ లుకింగ్ తో ఆకట్టుకుంటున్నారు. మరోవైపై కౌ బాయ్ గెటప్ లాంటి లుక్ తో ఎయిర్ పోర్టులో అందరి చూపును ఆకర్షించారు. ఎనర్జిటిక్ వాక్ తో అదరగొట్టారు. ప్రస్తుతం బాబు స్టైలిష్ లుక్, వాక్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అప్పటికే ‘ఎస్ఎస్ఎంబీ29’పై హైప్ నెలకొనగా.. మహేశ్ బాబు తాజా లుక్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని రూ.1000 కోట్లతో నిర్మించబోతున్నారనే మాటే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 

అలాగే త్వరలోనే ఈ చిత్ర అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తోంది. అదే సమయంలో ఎస్ఎస్ రాజమౌళి సినిమా స్టోరీ, సినాప్సిస్ గురించి రివీల్ చేయనున్నారంట. ఇక ఈ చిత్రం పీరియాడిక్ ఫిల్మ్ కాదని, ప్రస్తుతం కాలంలోనే కథ నడుస్తుందని టాక్ వినిపిస్తోంది. 2024 ఉగాది సందర్భంగా SSMB29 Shooting ప్రారంభమై..  రెండేళ్లకు 2026 ఉగాదికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. ఈ  మూవీతో మహేశ్ బాబు ఇండియాలోనే సరికొత్త రికార్డులను సెట్ చేయబోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్లు గా దీపికా పదుకొణె, ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్‌ నటించబోతున్నారని తెలుస్తోంది.  

The globe-trotting SuperStar is back home! ❤️‍🔥 returns to Hyderabad after a refreshing vacation in Germany 🤘 pic.twitter.com/45qPciKmcb

— Maheshbabu Fan Club (@MaheshBabu_FC)
click me!