సూపర్ స్టార్ ఇంట తీవ్ర విషాదం, మహేష్ బాబు తల్లి ఇందిర దేవి కన్నుమూత

Published : Sep 28, 2022, 07:39 AM ISTUpdated : Sep 28, 2022, 07:41 AM IST
సూపర్ స్టార్ ఇంట తీవ్ర విషాదం,  మహేష్ బాబు  తల్లి ఇందిర దేవి  కన్నుమూత

సారాంశం

టాలీవడ్  స్టార్ హీరో మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లిగారు.. సూపర్ స్టార్ కృష్ణ భార్య  ఇందిర దేవి మరణించారు.

టాలీవడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లిగారు.. సూపర్ స్టార్ కృష్ణ భార్య  ఇందిర దేవి మరణించారు.

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన అన్న రమేష్ బబు మరణించి ఏడాది కాకముందే.. మహేష్ బాబు తల్లిగారు ఇందిరా దేవి తుది స్వాస విడిచారు. అలనాటి సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి.. ఆమె గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలంగా ఆమె వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.  ఆమె పెద్ద కొడుకు చనిపోయిన కొంత కాలానికే ఇందిరాదేవి కూడా మరణించడం.. సూపర్ స్టార్ ఫ్యామిలీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అయ్యింది. 

 

 

ఇక ఇందిరాదేవి ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుదిస్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఆమె మరణంతో అటు మహేష్ ఫ్యామిలీతో పాటు చిత్ర పరిశ్రమలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన సమాచారంతో పాటు ఇతర విషయాలు మరికాసెపట్లో ప్రకటించే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?