జీఎస్టీ కమిషనర్ కు హీరో మహేష్ బాబు లీగల్ నోటీసులు

By pratap reddyFirst Published Dec 28, 2018, 6:24 PM IST
Highlights

పన్నులన్నీ తాను స్క్రమంగానే చెల్లించానని మహేష్ బాబు స్పష్టంచేశారు. కోర్టు పరిధిలో ఉన్న బ్యాంక్ ఖాతాలను ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం సరి కాదని ఆయన అన్నారు.

హైదరాబాద్: తెలుగు సినీ హీరో మహేష్ బాబు జీఎస్టీ కమిషనర్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ఖాతాలను స్తంభింపజేయడంపై ఆయన ఈ నోటీసులు జారీ చేశారు. 

పన్నులన్నీ తాను స్క్రమంగానే చెల్లించానని మహేష్ బాబు స్పష్టంచేశారు. కోర్టు పరిధిలో ఉన్న బ్యాంక్ ఖాతాలను ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం సరి కాదని ఆయన అన్నారు.

తాను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినని మహేష్ చెబుకున్నారు. హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ కోర్టు పరిధిలో ఉన్న 18 లక్షల 50 వేల రూపాయల పన్నును వడ్డీతో కలిపి 73 లక్షల 50 వేలుగా నిర్ణయించి బ్యాంక్ ఖాతాల నిలుపుదలకు ఆదేశారని మహేష్ బాబు గుర్తు చేస్తూ వాస్తవానికి 2007 -08 ఆర్థిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సేవలు ఎటువంటి పన్ను పరిధిలోకి రాదని ఆయన స్పష్టం చేశారు. 

అంబాసిడర్   సేవలను పన్ను పరిధిలోకి సెక్షన్ 65 (105) (జెడ్ జెడ్ జెడ్ జెడ్ క్యూ) ద్వారా 2010 జులై 1వ తేదీ నుంచి చేర్చారని, పన్ను చెల్లింపుదారుడు చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు ఖాతాల నిలుపుదలకు ఆదేశించిందని మహేష్ బాబు లీగల్ టీమ్ వివరించింది. 

 

ఫ్యాన్స్ హర్ట్.. ఎంజాయ్ చేస్తోన్న మహేష్!

హీరో మహేష్ బాబుకు జిఎస్టీ షాక్: ఖాతాలు ఫ్రీజ్

ఖాతాలు ఫ్రీజ్: ఫ్యామిలీతో సరదాగా మహేష్ బాబు

 

 

 

click me!