వైరల్ ఫొటో: భార్య వెనక దాక్కున్న మహేష్,కారణం అదే

Published : Nov 17, 2018, 09:57 AM IST
వైరల్ ఫొటో: భార్య వెనక దాక్కున్న మహేష్,కారణం అదే

సారాంశం

స్టార్ హీరోలకు అతి పెద్ద సమస్య...సినిమాలో ప్రత్యేకమైన లుక్ తో కనపడుతూంటే దాన్ని ఎవరికి కనపడకుండా దాచటం. మొన్నీమధ్య..ప్రభాస్ తన సాహో లుక్ రివీల్ కాకూడదని ..ఆర్.ఆర్.ఆర్ ఓపినింగ్ లో ప్రయత్నించారు. కానీ అది కష్టమని భావించి ..లాంచింగ్ కు వచ్చిన సినిమా టీమ్ తో  కలిసిపోయారు. 

స్టార్ హీరోలకు అతి పెద్ద సమస్య...సినిమాలో ప్రత్యేకమైన లుక్ తో కనపడుతూంటే దాన్ని ఎవరికి కనపడకుండా దాచటం. మొన్నీమధ్య..ప్రభాస్ తన సాహో లుక్ రివీల్ కాకూడదని ..ఆర్.ఆర్.ఆర్ ఓపినింగ్ లో ప్రయత్నించారు. కానీ అది కష్టమని భావించి ..లాంచింగ్ కు వచ్చిన సినిమా టీమ్ తో  కలిసిపోయారు. కానీ మహేష్ మాత్రం తన లుక్ ని బయిటకు రివీల్ కాకూడదని భావిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిగో ఈ క్రింద ఫొటో చూస్తే మీకు అది అర్దమవుతుంది.

వివరాల్లోకి వెళితే... గత రెండు నెలలుగా అమెరికాలోని న్యూయార్క్‌లో మహేష్‌బాబు మహర్షి చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించారు. కాగా, ఇటీవలే ఈ షెడ్యూల్‌కి ప్యాకప్‌ చేప్పేసి ఇండియా వచ్చేసారు. ఇక్కడ తన భార్య నమ్రతతో కలిసి ఓ పార్టీకి హాజరయ్యారు. నమ్రత ఆ పార్టీలో  తన భర్తతో  ఓ సెల్ఫీని తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే మహేష్ ఈ సెల్ఫీతో తన లుక్ బయిటకు వచ్చేస్తుందని భావించి...నమ్రత వెనుక దాక్కుని, కేవలం తన ఫేస్ లో కొంత భాగం మాత్రమే రివీల్ అయ్యేలా చేసారు.

మహర్షి విశేషాలకు వస్తే..

ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో  తదుపరి షెడ్యూల్‌ పనిలో ఉంది. ఇటీవలే రిలీజైన టీజర్‌ తరువాత, కంఫ్లీట్‌ కాన్సంట్రేషన్‌ షూటింగ్‌ పైనే పెట్టిన ఫిల్మ్‌ మేకర్స్‌, త్వరలో సినిమా ముగింపు దశకు తీసుకురాబోతున్నారు. అల్లరి నరేష్‌ ఇంట్రెస్టింగ్‌ రోల్‌ ప్లే చేస్తున్న ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. మహేష్‌ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తున్నాడు. దిల్‌ రాజు, పివిపి ప్రసాద్‌, అశ్వినిదత్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకుడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి