మరోసారి ఆదర్శంగా నిలిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Published : Jan 29, 2018, 08:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
మరోసారి ఆదర్శంగా నిలిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు

సారాంశం

సామాజిక సేవలో ముందుండే మహేష్ బాబు ఓ కేన్సర్ పేషంట్ కు ఆర్థిక సాయం చేసిన ప్రిన్స్ ప్రిన్స్ సాయంతో అనారోగ్యం నుంచి బైటపడ్డ చిన్నారి తనీష్

సినీహీరోలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం మామూలుగా జరుగుతుంటుంది. ఆపదలో వున్న వారిని ఆదుకునేందుకు ససమ వంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తుంటారు ఫిలిం పర్సనాలిటీస్. ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. శ్రీమంతుడు సినిమాలో లేనివాళ్ళకు పుట్టిన ఊరికి ఏదైనా మంచి చేయాలన్న సందేశాన్ని చెప్పిన మహేష్ దాన్ని తన నిజ జీవితంలో కూడా పాటిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేప్పట్టిన మహేష్ ప్రతి సారి తాను పర్యవేక్షించలేడు కనక భార్య నమ్రతా శిరోద్కర్ సహాయం తీసుకుంటూ ఉంటాడు. మహేష్ తరఫున ఆ గ్రామాలను తనే సందర్శిస్తూ ఉంటుంది.
 

తాజా సంఘటన మహేష్ మంచి మనసును మరోసారి బయట పెట్టింది. తనీష్ అనే అబ్బాయి కాన్సర్ తో బాధ పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మహేష్ అందుకు కావలసిన పూర్తి ఆర్థిక సహకారాన్ని అందించి తనకు జబ్బు నయం అయ్యేందుకు సహాయం చేయటం పట్ల ఆ తల్లితండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. వ్యక్తిగతంగా మహేష్ ను కలిసి సహాయానికి కృతజ్ఞతలు తెలిపి తమతో సమయం గడిపినందుకు థాంక్స్ కూడా చెప్పారు. ఇది చూసిన మహేష్ ఫాన్స్ సినిమాలతో పాటు తమ అభిమాన హీరో నిజ జీవితంలో అంత కంటే పెద్ద హీరో అనిపించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



అనారోగ్యంతో బాధ పడుతున్న నిరుపేద పిల్లలకు సహాయం చేసే నిమిత్తం మహేష్ బాబు రైన్ బో హాస్పిటల్ , ఆంధ్ర హాస్పిటల్స్ తో టై అప్ అయ్యాడు. చిన్న పిల్లలకు ఎలాంటి విపత్తు వచ్చినా తనవంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. భరత్ అనే నేను షూటింగ్ లో తలముకలైన మహేష్ తాను సహాయం అందించిన కుటుంబం కోసం కొంత సమయం ప్రత్యేకంగా గడపటం అంటే చిన్న విషయం కాదుగా. ప్రస్థుతం భరత్ అను నేను క్లైమాక్స్ సీన్ షూటింగ్ జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు