వీడియో:కరోనా టెస్ట్ చేయించుకున్న మహేష్ కుమార్తె సితార..

By Surya PrakashFirst Published Dec 31, 2020, 4:31 PM IST
Highlights

తాను కరోనా టెస్ట్ చేయించుకోవడానికి భయపడ్డానని చెప్పింది సితార. కాని నా పక్కన అమ్మ ఉంది .. నా చేయి పట్టుకొని! మీరు స్నేహితులను కుటుంబ సభ్యులను కలుస్తుంటే పరీక్షలు చేయించుకుని మీరు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోండి. కరోనా టెస్ట్ చేయించుకోడానికి భయపడొద్దు.. తనకు ఎలాంటి నొప్పి రాలేదు.. టెన్షన్ కూడా లేదు.. మన ఆరోగ్యం, సమాజం కోసం అందరూ టెస్టులు చేయించుకోండి ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్.. స్టే సేఫ్“ అంటూ మెసేజ్ ఇచ్చింది సితార.
 
టాలీవుడ్ లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది.  తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్నారు చరణ్. చరణ్ కు కరోనా సోకిందని ప్రకటించిన కొంత సమయానికే మరో మెగా హీరో వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ లోగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార కరోనా టెస్ట్ చేయించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది సితార ఇందుకు సంబంధించిన వీడియోని సితార పోస్ట్ చేసింది. ఆ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.

click me!