మహేష్ కౌంటర్ సుకుమార్ కేనా..?

Published : May 02, 2019, 10:23 AM IST
మహేష్ కౌంటర్ సుకుమార్ కేనా..?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. దీంతో అదే కథతో అల్లు అర్జున్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

తనకోసం సుకుమార్ వెయిట్ చేయకుండా మరో హీరో దగ్గరకు వెళ్లడంతో మహేష్ ఆ విషయాన్ని అంత తేలికగా మర్చిపోలేదనిపిస్తుంది. నిన్న జరిగిన 'మహర్షి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ పరోక్షంగా సుకుమార్ పై సెటైర్ వేశాడు. దర్శకుడు వంశీ పైడిపల్లిని పొగిడే క్రమంలో సుకుమార్ చేసిన తప్పుని వేలెత్తి చూపించాడు.

వంశీ తన దగ్గరకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు పది నిముషాలు విని పంపించేద్దామనుకున్నట్లు చెప్పిన మహేష్ కథ నచ్చడంతో కొంతకాలం ఎదురుచూస్తారా..? అని వంశీని  అడిగాడట. అప్పటికి రెండు సినిమాల కమిట్మెంట్స్ ఉండడంతో మహేష్.. వంశీని వెయిట్ చేయమని అడిగారట.

దానికి ఆయన ఓకే చెప్పారని.. ఈరోజుల్లో అలా ఎదురుచూడడం కష్టమని, రెండు నెలలు కూడా ఓ హీరో కోసం ఎదురుచూడకలేకపోతున్నారని.. ఆ కథ పట్టుకొని మరో హీరో దగ్గరకు వెళ్లిపోతున్నారంటూ ఇన డైరెక్ట్ గా సుకుమార్ కి కౌంటర్ వేశాడని చెప్పుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Crazy Kalyanam Movie Review: క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ, అనుపమా పరమేశ్వరన్‌ సినిమా ఎలా ఉందంటే?
Bigg Boss 10: తనకి తానే చెంపదెబ్బలు కొట్టుకుని ఏడ్చేసిన వంశీ..ఇక నీ ముఖం కూడా చూడను, షాలినిపై రోహిత్ ఫైర్