ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి.. హీరోయిన్ కి మహేష్ పంచ్!

Published : May 02, 2019, 09:42 AM IST
ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి.. హీరోయిన్ కి మహేష్ పంచ్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పటికే పాతిక సినిమా చేశారు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పటికే పాతిక సినిమా చేశారు. మరి ఇప్పుడు ఆయన దర్శకుడిగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచన అభిమానులకు కూడా వచ్చి ఉండదు. కానీ హీరోయిన్ పూజా హెగ్దే మాత్రం మహేష్ డైరెక్టర్ గా మారితే చూడాలనుందని, ఆయనలో డైరెక్టర్ యాంగిల్ ఉందని నిన్న జరిగిన 'మహర్షి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పింది.

''చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ ఓ మంచి డైరెక్టర్ కాగలరు. భవిష్యత్తులో ఆయన డైరెక్టర్ అవుతారో లేదో తెలియదు కానీ ఆయన కొన్ని సన్నివేశాలు చూసే విధానం కొత్తగా ఉంటుంది. ఆయన డైరెక్టర్ యాంగిల్ ఉందని'' కామెంట్స్ చేసింది.

ఇది విన్న మహేష్ బాబు.. పూజాకి పంచ్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో ఎవరి పని వాళ్లు చేయాలని, అప్పుడే బాగుంటుందని.. తను యాక్టర్ కాబట్టి యాక్టింగే చేస్తానని.. క్లారిటీ ఇచ్చాడు. పూజా తనలో ఓ డైరెక్టర్ ని చూస్తే అది తన అభిమానమని చెప్పిన మహేష్ ఎప్పటికీ తను నటుడిగానే కొనసాగుతానని తేల్చి చెప్పాడు.

పూజా మాటలను ఏదో కాంప్లిమెంట్ లా తీసుకోకుండా సీరియస్ గా ఆ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో మహేష్ కి అసలు డైరెక్టర్ అయ్యే ఆలోచన లేదని తేలింది. ఇక 'మహర్షి' విషయానికొస్తే.. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరో వారం రోజుల్లో మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  
 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు