
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అనన్య పాండే. బాలీవుడ్ హీరో చుంకీ పాండే కూతురే ఈ బ్యూటీ. ఇంకా ఆమె నటించిన మొదటి సినిమా విడుదల కాలేదు కానీ బాలీవుడ్ లో ఈ బ్యూటీ హాట్ టాపిక్ గా మారింది.
దానికి కారణం ఆమె నటుడు వరుణ్ ధావన్ తో ప్రేమలో ఉన్నానని చెప్పడమే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ మొహమాటపడకుండా తనకు వరుణ్ ధావన్ అంటే ఇష్టమని, అతడిని పిచ్చిగా ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. వరుణ్ లో తనకు నచ్చే విషయం ఎనర్జీ అని, చాలా క్యూట్ గా ఉండడంతో పాటు.. ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడని తెలిపింది.
ఈ విషయం చెప్పడం పద్ధతో కాదో తనకు తెలియదని.. అయినా చెబుతున్నా అంటూ వరుణ్ ని పిచ్చిగా ప్రేమిస్తున్న విషయాన్ని వెల్లడించింది. ఈ విషయం అతడికి కూడా తెలుసునని చెప్పింది. ఇక వరుణ్ విషయనికొస్తే.. అతడు తన చిన్ననాటి స్నేహితురాలు నటాషాని ఘాడంగా ప్రేమిస్తున్నాడు.
త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ విషయాలు తెలిసి కూడా అనన్య పాండే అతడిని ఇష్టపడుతుందంటే అతడిపై ఆమెకి ఎంత అభిమానముందో అర్ధమవుతోంది!