విజయశాంతిపై మహేష్ కామెంట్.. 'కొడుకు దిద్దిన కాపురం'లో ఇలా!

Published : Sep 12, 2019, 07:06 PM ISTUpdated : Sep 12, 2019, 07:09 PM IST
విజయశాంతిపై మహేష్ కామెంట్.. 'కొడుకు దిద్దిన కాపురం'లో ఇలా!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది మహేష్ బాబు మహర్షి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి సినిమాలు మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం ఉంది. దీనితో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

మహేష్ బాబు, అనిల్ రావిపూడి తొలి కలయికలో వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. యంగ్ బ్యూటీ రష్మిక మందన ఈ చిత్రంలో మహేష్ సరసన నటిస్తోంది. దిల్ రాజు, రామ్ సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తుండడం అంచనాలని పెంచుతోంది. విజయశాంతి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విజయశాంతి, మహేష్ బాబు 30 ఏళ్ల క్రితం కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో విజయశాంతి, మహేష్ తల్లికొడుకులుగా నటించారు. 

తాజాగా మహేష్ బాబు ఆ చిత్రాన్నిగుర్తు చేసుకున్నాడు. కొడుకుదిద్దిన కాపురం చిత్ర సెట్స్ లో విజయశాంతితో కలసి ఉన్న ఓ అందమైన ఫోటోని షేర్ చేశాడు. 1989లో కొడుకు దిద్దిన కాపురంలో విజయశాంతిగారితో కలసి నటించా. కాలం చాలా వేగంగా మారిపోయింది. మళ్లీ 30 ఏళ్ల తర్వాత ఆమెతో కలసి నటిస్తున్నా అని మహేష్ పేర్కొన్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Suriya 46 Movie: సూర్య 46కి, గజినీకి సంబంధం ఏంటి? అంచనాలు పెంచేసిన నిర్మాత సమాధానం
2025 లో రియల్ లైఫ్ స్టోరీలతో వచ్చిన 6 సినిమాలు.. కొన్ని హిట్లు, కొన్ని వివాదాలు