Mahesh Babu clarifies his words on Bollywood: బాలీవుడ్ ని కించపరచలేదు... మహేష్ వివరణ 

By Sambi ReddyFirst Published May 11, 2022, 5:45 PM IST
Highlights

మేజర్ మూవీ ప్రమోషన్స్ లో మహేష్ చేసిన వ్యాఖ్యలు ఒకింత బాలీవుడ్ లో కలకలం రేపాయి. బాలీవుడ్ పరిశ్రమ నన్ను భరించలేదు. కావున హిందీ సినిమాలు చేసి సమయం వృధా చేసుకోనని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ మీడియా మహేష్ వ్యాఖ్యలకు పెడర్ధాలు తీస్తున్న నేపథ్యంలో ఆయన స్వయంగా వివరణ ఇచ్చారు.

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న మహేష్ (Mahesh Babu)బాలీవుడ్ ఎంట్రీపై చాలా కాలంగా చర్చ నడుస్తుంది. ఇక్కడ బాలీవుడ్ కి వెళ్లడం అంటే హిందీ చిత్రం చేయడమని కాదు. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తమ చిత్రాలు హిందీలో విడుదల చేసిన సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో మహేష్ బాలీవుడ్ మీడియా నుండి ఈ ప్రశ్న ఎదుర్కొన్నారు. మీరు బాలీవుడ్ చిత్రం ఎప్పుడు చేస్తారని అడుగగా... మహేష్ కొంచెం ఓపెన్ కామెంట్స్ చేశారు. 

నాకు బాలీవుడ్ నుండి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే బాలీవుడ్ పరిశ్రమ నన్ను భరించలేదు. కాబట్టి హిందీ చిత్రాలు చేయడం సమయం వృధా చేసుకోవడమే అవుతుంది. తెలుగులో నేను బిగ్గెస్ట్ స్టార్ గా ఉన్నాను. స్టార్డం అనుభవిస్తున్నాను. కాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమను వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. మంచి చిత్రాలు చేయాలి, మరింత ఎదగాలనే ఆలోచన ఉందన్నారు. బాలీవుడ్ నన్ను భరించలేదు, ఇక్కడ మూవీస్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం అని మహేష్ చెప్పడం బాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది. 

మహేష్ మాటలు వాళ్లకు వేరేలా అర్థమయ్యాయి. ఎప్పటి నుండో బాలీవుడ్ స్టార్స్ సౌత్ స్టార్స్ కి డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాంటి బాలీవుడ్ మహేష్ కి రెమ్యూనరేషన్ ఇవ్వలేదా?. సౌత్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాలు బాలీవుడ్ ని డామినేట్ చేస్తున్న నేపథ్యంలో, మహేష్ ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేశారా? అంటూ విశ్లేషణ చేయడం మొదలుపెట్టారు. తన కామెంట్స్ తప్పుగా ప్రచారం అవుతున్నాయని తెలుసుకున్న మహేష్ స్వయంగా వివరణ ఇచ్చారు. 

నేను తెలుగులో చిత్రాలు చేస్తాను. అవి హిందీలో విడుదల కావచ్చు. హిందీ చిత్రాలు చేయను అని మాత్రమే నేను చెప్పాను. రాజమౌళితో నేను చేయనున్న మూవీ పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదల కానుంది. నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. భాషా బేధం లేకుండా సినిమా అంటే నాకు గౌరవం ఉంది. అలాగే దేశంలోని అన్ని బాషలను నేను గౌరవిస్తాను .. అంటూ వివరణ ఇచ్చారు. 

ఇప్పటికే సౌత్ పరిశ్రమ ఆధిపత్యాన్ని తట్టుకోలేని బాలీవుడ్ విషం కక్కుతున్నారు. ఈ క్రమంలో మహేష్ వ్యాఖ్యలు వాళ్లలో అగ్గిరాజేశాయి. మహేష్ నిర్మాతగా ఉన్న మేజర్ మూవీపై బాలీవుడ్ వర్గాలు ఈ ప్రభావం చూపే ఆస్కారం కలదు. నెగిటివ్ రివ్యూస్, థియేటర్స్ సమస్యలు సృష్టించే అవకాశం కలదు. మహేష్ ఈ అర్థంలో అన్నప్పటికీ బాలీవుడ్ మాత్రం ఆయన వ్యాఖ్యలు చాలా తప్పుగా తీసుకుంది. 

click me!