కమల్ హాసన్ ‘విక్రమ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ.. ఈ రోజే రిలీజ్.. దుమ్ములేపుతున్న పోస్టర్

Published : May 11, 2022, 03:54 PM IST
కమల్ హాసన్ ‘విక్రమ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ.. ఈ రోజే రిలీజ్.. దుమ్ములేపుతున్న పోస్టర్

సారాంశం

విలక్షణ నటుడు కమల్ హాసన్ తాజాగా నటించిన చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మేకర్స్ అప్డేట్స్ తో సర్ ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై అప్డేట్ అందించారు.   

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న చిత్రం `విక్రమ్‌`. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ పతాకంపై కమల్‌ హాసన్‌ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఇఫ్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి విశేషంగా ఆదరణ లభించింది.

తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ అందించారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ‘విక్రమ్’ నుంచి మాస్ బీట్ తో కూడిని ‘పాతాళ పాతాళ’ సాంగ్ రిలీజ్ కానుంది. అయితే ఈ అప్డేట్ అందిస్తూ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఊరమాస్ లుక్ ను సొంతం చేసుకుంది. కమల్ హాసన్ హుషారుగా స్టెప్పులేస్తూ కనిపిస్తున్నారు. దీంతో సాయంత్రం ఫస్ట్ సింగిల్ తో యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే అంటూ ఆయన అభిమానులు.   

ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్  డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన గత చిత్రం ‘మాస్టర్’కు కూడా అనిరుధే బెస్ట్ మ్యూజిక్ అందించారు. మాస్, క్లాస్ ఏదైనా అనిరుధ్ చేయి పడితే బాక్సులు బద్దలవ్వాల్సిందే. ఇప్పటికే ‘విక్రమ్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ దుమ్ములేపిన అనిరుధ్.. ఫస్ట్ సింగిల్ ను ఏ స్థాయిలో అందిస్తాడో చూడాలి.  

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్