
సూపర్ స్టార్ మహేష్‌బాబు ఫ్యామిలీ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మహేష్, తన ఫ్యామిలీతో లండన్ టూర్ వెళ్లిన విషయం తెలిసిందే. మహేష్‌తోపాటు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారలతో కలిసి దాదాపు పదిహేను రోజుల ఫ్యామిలీ వెకేషన్‌కి వెళ్లారు. రెండు వారాల పాటు నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేసి ఎట్టకేలకు నేడు శుక్రవారం తిరిగి వచ్చారు. హైదరాబాద్ చేరుకున్నారు. పనిలోపనిగా బర్త్ డేని కూడా మహేష్ విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. లండన్, స్కాట్‌లాండ్ ఇలా స్థానిక అందమైన ప్రదేశాలన్నింటిని చుట్టేసి వచ్చారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో మహేష్ వెకేషన్‌కి వెళ్లడం విశేషం.
ఈ వెకేషన్‌లో రిలాక్స్ అవడంతోపాటు కొన్ని వ్యక్తిగత పనులు కూడా పూర్తి చేసుకున్నారని సమాచారం. కుమారుడు గౌతమ్‌ని లండన్‌లో చదివించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్‌ని కూడా పూర్తి చేసినట్టు సమాచారం. మరోవైపు ఇక్కడ చాలా మంది పేద చిన్నారులకు మహేష్ ఫౌండేషన్ ద్వారా హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్న విషయం తెలిసిందే దానికి సంబంధించిన డాక్టర్లని కన్సల్టేషన్ వ్యవహారాలు కూడా ఈ ట్రిప్‌లో చూసుకున్నారని సమాచారం. ఎట్టకేలకు మహేష్ తిరిగి వచ్చారు. దీంతో ఇక `గుంటూరు కారం` మూవీ షూటింగ్ ఎప్పట్నుంచి అనేది అభిమానులను తొలుస్తున్న ప్రశ్న.
`గుంటూరు కారం` చిత్రానికి సంబంధించి అనేక రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. వరుసగా షూటింగ్ లు వాయిదా పడుతుందని అంటున్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌కి, మహేష్‌కి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయని, త్రివిక్రమ్ వర్క్ విషయంలో మహేష్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అనేక విషయాలకు సంబంధించి ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ని ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఈ నెల 16 నుంచి కొత్త షెడ్యూల్‌ని స్టార్ట్ చేసే అవకాశం ఉందట. మహేష్ సహకరిస్తే షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. మరి అనుకున్న టైమ్‌కి స్టార్ట్ అవుతుందా? లేక కథ మళ్లీ మొదటికొస్తుందా? చూడాలి.
ఇక మహేష్ బాబు హీరోగా నటించే ఈ చిత్రంలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. మరో కథానాయికగా మీనాక్షి చౌదరి ఫైనల్ అయ్యింది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. హరికా అండ్ హాసినీ క్రియేటషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. మహేష్‌బాబు బర్త్ డే సందర్భంగా `గుంటూరు కారం` చిత్రం నుంచి కొత్త పోస్టర్స్ విడుదల చేశారు. ఊరమాస్ లుక్‌లో ఉన్న మహేష్ ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి జనవరి 12న విడదుల కాబోతుంది.