మహేష్,అనీల్ రావిపూడి చిత్రం లాంచ్ డేట్!

By AN TeluguFirst Published 22, May 2019, 1:01 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రం హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రం హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వరకూ ఈ చిత్రం ప్రమోషన్ లో ఉన్న మహేష్ తన ఫ్యామిలీతో కలిసి యూపర్ టూర్ కు వెళ్లారు. అక్కడి నుంచి రాగానే ఈ నెల 31 అంటే సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున ఈ సినిమాని లాంచ్ చేయనున్నారు.  అయితే లాంఛనంగా జరిగే ఈ లాంచింగ్ కు మహేష్ హాజరు కారు.  ఆ తర్వాత జూన్ 26 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. అలాగే సంక్రాంతికి  ఈ చిత్రం రిలీజ్ కానుంది. 

అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే కథ, కథనాలను లాక్ చేశారు.  పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కబోతున్నదని సమాచారం. దూకుడు, ఖలేజా నాటి కామెడీ మరోసారి మహేష్ చూపబోతున్నారు. ముఖ్యంగా మహేష్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలెట్ కానుంది. 

మహేష్ లాంటి స్టార్ హీరో దొరికాక సినిమా సూపర్ హిట్ కొట్టాల్సిందే. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్టుపై బాగా  కష్టపడుతున్నాడు.  కథను లాక్ చేసినా..కొత్త కొత్త ఐడియాలను సినిమాలో కలుపుతున్నారట. ఇక  టైటిల్ విషయంలో దర్శకుడు ఇప్పటి వరకు ఓ అభిప్రాయానికి రాలేదని వినికిడి.  అనేక టైటిల్స్ లు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ అనుకున్నా, మహేష్ బాబు మూడు అక్షరాలా పేరు పెట్టాలని సూచించారని వార్తలు వచ్చాయి.  మరో ప్రక్క రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్ తెరమీదకు వచ్చింది.  ఏ టైటిల్ ఫైనలైజ్ చేస్తారో మరి.

Last Updated 22, May 2019, 1:01 PM IST