డైరెక్టర్ జయకు.. సినీ ప్రముఖుల నివాళి

Published : Aug 31, 2018, 11:52 AM ISTUpdated : Sep 09, 2018, 12:39 PM IST
డైరెక్టర్ జయకు.. సినీ ప్రముఖుల నివాళి

సారాంశం

ఆమెకు నివాళులర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకున్నారు.  

తెలుగు సినీ మహిళా డైరెక్టర్ జయ గురువారం రాత్రి గుండె నొప్పితో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమెకు నివాళులర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకున్నారు.

విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, నమ్రతా, నటుడు ఆది, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఆయన కుమారుడు ఆకాశ్ పూరీ, సుధీర్ బాబు, మంచు మనోజ్, డైరెక్టర్ నందినీ రెడ్డి, డ్యాన్స్ మాష్టర్ శేఖర్, యాంకర్ ఝాన్సీ, నటుడు ఉత్తేజ్ తదితరలు ఆమె నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. 

ప్రేమలో పావని కల్యాణ్ అనే సినిమాతో దర్శకురాలిగా మారిన ఆమె చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. 

జర్నలిస్టుగా ఆమె తన కెరీర్ ను ప్రారంభించి, సూపర్ హిట్ అనే సినీ వారపత్రికను ప్రారంభించారు. ఆమె తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెం గ్రామంలో జన్మించారు .

అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎంఎ సైకాలజీ పూర్తి చేసిన తర్వాత ఆంధ్రజ్యోతితో జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత చిత్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికల్లో పనిచేశారు. 2002లో దీపక్, అంకిత జంటగా నటించిన ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రంతో చిత్ర దర్శకురాలిగా మారారు.

 

read more related news

మహిళా సినీ దర్శకురాలు జయ కన్నుమూత

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా