కోలీవుడ్ హీరో విశాల్ కు కోర్ట్ సమన్లు

Published : May 12, 2019, 03:31 PM IST
కోలీవుడ్ హీరో విశాల్ కు కోర్ట్ సమన్లు

సారాంశం

  కోలీవుడ్ హీరో విశాల్ గత కొంత కాలంగా నడిఘర్ సంఘంకి సంబందించిన సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇప్పుడు కోర్టు నుంచి మరో సమస్య వచ్చింది. శరత్ కుమార్ - రాధారావికి కేసుల విషయంలో విశాల్ కు సమన్లు జారీ అయ్యాయి.

కోలీవుడ్ హీరో విశాల్ గత కొంత కాలంగా నడిఘర్ సంఘంకి సంబందించిన సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇప్పుడు కోర్టు నుంచి మరో సమస్య వచ్చింది. శరత్ కుమార్ - రాధారావికి కేసుల విషయంలో విశాల్ కు సమన్లు జారీ అయ్యాయి. కోర్టు ఇచ్చిన సందేశాన్ని పట్టించుకోకుండా విశాల్ కోర్టులో హాజరుకాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

గతంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష పదవిలో కొనసాగిన శరత్ బాబు - రాధారవిలపై అక్రమంగా స్థలం అమ్మేశారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. విశాల్ కమిటీ సైతం కోర్టులో పిటిషన్ వేయగా ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే ఇందులో భాగంగా సరైన అధరాలు కావాలని కోర్టు విశాల్ కి సమన్లు జారీ చేయగా విశాల్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. 

అయితే షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల విశాల్ రాలేకపోయారని మరొకరోజు తప్పకుండా వచ్చి తగిన ఆధారాలను సమర్పిస్తారని విశాల్ అనుచరులు   కోర్టుకు సమాధానమిచ్చారు. అయితే విశాల్ తగిన అధరాలు ఇస్తేనే కేసు వివాదం వీలైనంత త్వరగా ఓ కొలిక్కి వస్తుందని పోలీసులన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్